Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కామ్రేడ్ టీజర్ లో ముద్దు?

కామ్రేడ్ టీజర్ లో ముద్దు?

విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా డియర్ కామ్రేడ్ విడుదలకు రెడీ అవుతోంది. మే31 విడుదల. ఇప్పుడు టీజర్ బయటకు వస్తోంది. ఈ ఆదివారం టీజర్ రాబోతోంది. ఈ టీజర్ లో కూడా అర్జున్ రెడ్డి ఛాయలు ఎక్కువగా వుండబోతున్నట్లు వినికిడి. 

టీజర్ లో స్క్రీన్ ను రెండుగా విభజించి ఓ భాగంలో స్టూడెంట్లు, వాళ్ల ఉద్యమాలు, వగైరా ఎగ్రెసివ్ కంటెంట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో భాగంలో సమాంతరంగా హీరో హీరోయిన్ల కిస్సింగ్ సీన్ ను రసవత్తరంగా చూపిస్తారని తెలుస్తోంది.

అంటే మొత్తం మీద డియర్ కామ్రేడ్ టీజర్ మళ్లీ అర్జున్ రెడ్డి అడుగుజాడలో ముందుకు వెళ్తుందన్నమాట.  భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు అందిస్తున్న ఈ సినిమాకు మైత్రీ మూవీస్ నిర్మాతలు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?