దర్శకుడు ఆర్జీవీ ఏదో విధంగా సినిమాల్లో నెట్టుకువస్తున్నారు. తీస్తున్నవి, తిసి విడుదలకు సిద్దం చేసినవి బోలెడు వున్నాయి.
సినిమాలు ఎన్ని వున్నాయో బకాయిల వివాదాలూ అన్ని వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ తో తీసిన సినిమాకు స్టేల మీద స్టేలు వస్తున్నాయి. ఆర్జీవీ ఎలాంటి మోసగాడు అన్నది నట్టి కుమార్ గట్టిగా ఆరోపించారు. నట్టి కుమార్ మీద ఆర్జీవీ తన స్టయిల్ కామెంట్లు తాను చేసారు. ఆ కేసు నడుస్తోంది.
ఇప్పుడు మరో కేసులో ఇరుక్కున్నారు. దిశ సినిమా తీస్తున్న టైమ్ లో తన దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదంటూ శేఖర్ రాజు అనే ఆయన ఫిర్యాదు చేసారు. పలు కీలక సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఇలా బయటకు రాని వారు ఇంకా చాలా మంది వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
విశాఖకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ కు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ టైమ్ లో సినిమా ఇస్తానని డబ్బులు తీసుకని ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. అడుగుతుంటే నేడు..రేపు అంటూ వాయిదాలు వేస్తున్నారని బోగట్టా. చూస్తుంటే ఒక్కొక్కరు బయటకు వచ్చేలా కనిపిస్తోంది పరిస్థితి.
ఎంతో తెలివి వుండి, మంచి సినిమాలు తీయగల సత్తా వుండి, నోటికి తోచింది మాట్లాడుతూ, చేతికి వచ్చింది తీసేస్తూ ఆర్జీవీ తన పరువు తానే పాడు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.