Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇంద్రగంటి భారీ సినిమా

ఇంద్రగంటి భారీ సినిమా

చిన్న, మీడియం సినిమాలు చేసి, తనకంటూ ఒక స్టయిల్ ను, ఒక పేరును తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. కానీ వి సినిమా విషయంలో ఆయన తప్పటడుగు వేసారు. 

నిర్మాత దిల్ రాజు అదృష్టం బాగుండి ఆ సినిమా ఓటిటికి వెళ్లి నష్టాల నుంచి తప్పించుకుంది. అయితే గతంలోనే ఇంద్రగంటి ఓ భారీ కథ చేసారు. అది కూడా పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కథ. ఆ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించాల్సి వుంది.

కానీ మైత్రీ కి, నిర్మాత దిల్ రాజుకు కుదిరిన ఒప్పందంలో భాగంగా శివనిర్వాణ సినిమా అటు వెళ్లింది. ఇంద్రగంటి భారీ సినిమా ఇటు వచ్చింది. అప్పటి లెక్క ప్రకారం ఆ భారీ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ నే హీరోగా చేయాలి. మరి ఇప్పుడు చేస్తారో లేక హీరో మారతారో తెలియదు కానీ ప్రాజెక్ట్ మాత్రం దిల్ రాజునే నిర్మించబోతున్నారట.

ప్రస్తుతానికి ఇంద్రగంటి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాను ఫినిష్ చేసి పక్కన పెట్టారు. ఆ సినిమా విడుదలకు డేట్ దొరకడం లేదు. అది విడుదలయిన తరువాత హీరో డిసైడ్ అయితే దిల్ రాజు నిర్మాణంలో భారీ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?