ఎఫ్ 3. ఈ మధ్య సినిమా వార్తలు, ప్రచారం, అన్నీ ఈ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. వెంకీ-వరుణ్ నటించిన ఈ అనిల్ రావిపూడి సినిమా మీద నిర్మాత దిల్ రాజు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
అనిల్ రావిపూడి అన్నీ తానై ప్రచారం సాగిస్తున్నారు. కనిపించని టీవీ చానెల్ లేదు. చేయని డ్యాన్స్ లు లు లేవు. అనిల్ తో పాటు హీరోలు వెంకీ, వరుణ్ కూడా ప్రచారం సాగించారు. మెహరీన్…సోనాలి కూడా తళుక్కున మెరిసారు.
కానీ ఒకే ఒక్కరు కనిపించనిది… తమన్నా భాటియా. టాలీవుడ్ లో ఎఫ్ 3 హడావుడి ఇంత భయంకరంగా వుంటే తమన్నా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా రాలేదు.
వంక చెప్పడానికి కేన్స్ కు వెళ్లాను అన్న కారణం వుంది. అది వేరే సంగతి. తమన్నా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. ఇలాంటి టైమ్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు వుంటే దాన్ని వాడుకోవాల్సి వుంది. అయినా కూడా పట్టించుకోలేదు అంటే సమ్ థింగ్..సమ్ థింగ్ అన్నమాట.
కొన్నాళ్ల క్రితమే ఎఫ్ 3 యూనిట్ కు తమన్నాకు మధ్య ఏదో జరిగిందని వెల్లడిస్తే, అబ్బే అంతా ఊ ఉత్తుత్తినే అంటూ ఖండించారు. కానీ ఇప్పుడు ఈ సీన్ అంతా చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.