రాజకీయం చేయకపోవడం ఇదేనా బాబూ!

గోతి కాడ నక్కల్లా సరైన అవకాశం కోసం ఎదురుచూసే ధోరణి అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. దీనికి పార్టీల వ్యత్యాసాలు ఉండవు. రాజకీయ నాయకుడు అనే ముద్ర వేసుకున్న తర్వాత.. ఎవ్వరైనా సరే.. ఇలా గుంటనక్కల…

గోతి కాడ నక్కల్లా సరైన అవకాశం కోసం ఎదురుచూసే ధోరణి అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. దీనికి పార్టీల వ్యత్యాసాలు ఉండవు. రాజకీయ నాయకుడు అనే ముద్ర వేసుకున్న తర్వాత.. ఎవ్వరైనా సరే.. ఇలా గుంటనక్కల తరహాలోనే ఆలోచిస్తూ ఉంటారు. అయితే అందులో హెచ్చతగ్గులు మాత్రమే ఉంటాయి. కొందరు గుంటనక్కలు అవకాశం వస్తే వాడుకుందాం అని ఆలోచించే వాళ్లయితే.. అవకాశం సృష్టించుకునే వారు  కొందరు. ఈ ఉపోద్ఘాతం అంతా పక్కన పెట్టేద్దాం.

వర్తమానంలోకి వస్తే… ‘‘నేను రాజకీయం చేయను.. మీరు సమర్థంగా పనిచేయాలని మాత్రమే చెబుతా’’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటున్నారు. ఒక రకంగా ఆలోచించినప్పుడు.. ప్రస్తుతం రాష్ట్రం ఇంత కష్టాల్లో, విపత్తులో ఉంటే.. తాను వెళ్లి హైదరాబాదులో ‘సేఫ్టీ జోన్’ లో కూర్చున్న చంద్రబాబునాయుడు.. అదే నగరంలో ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ‘నేను రాజకీయం చేయను’ అని డప్పు కొట్టి చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది. ఈ ఒక్కటీ బేరీజు వేసుకుంటే చాలు.. కరోనాపై రాజకీయం చేస్తున్నారనే విమర్శలు ఆయనపై ఎంతగా వెల్లువెత్తుతున్నాయో అర్థమౌతుంది.

నిజానికి చంద్రబాబునాయుడును ఒకందుకు అభినందించాలి. కరోనా అంశాన్ని రాజకీయం చేయవద్దు.. అని కొన్నాళ్ల కిందట ఆయన తన పార్టీ వారికి పిలుపు ఇచ్చారు. అబ్బా ఎంత సహృదయత. ప్రతిపక్ష నాయకుడంటే ఇలాగే ఉండాలి. కనీసం విపత్తుల సమయంలోనైనా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. ప్రజలకోసం పనిచేయాలి అని అంతా ప్రజలు అనుకున్నారు. కానీ.. చంద్రబాబు పిలుపులోని అంతరార్థాన్ని తెలుగు తమ్ముళ్లు బాగానే అర్థం చేసుకున్నారు.

వారు అచ్చంగా జగన్ పై రాజకీయ లబ్ధికోసం కువిమర్శలు చేయడం ప్రారంభించారు. ప్రతిరోజూ కేడర్ తో వీడియో, టెలి కాన్ఫరెన్సులు నిర్వహిస్తే తప్ప.. మనశ్శాంతిగా ఉండలేని చంద్రబాబునాయుడు.. తన తెలుగు తమ్ముళ్లు నీచమైన విమర్శలు చేసినప్పుడు.. బహిరంగంగా అక్కర్లేదు గానీ.. ఇంత చీప్ రాజకీయాలు చేయొద్దని- ప్రెవెటేగానైనా వారిని మందలించారా?

తాజాగా రేషన్ షాపుల్లో సరుకుల వ్యవహారం తెరపైకి వస్తే స్వయంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. అసాధ్యమైన కోరికలు కోరుతున్నారు. (చదవండి : అచ్చంగా రాజకీయం చేస్తున్న చంద్రబాబు) పైగా ఇప్పుడు నేను రాజకీయం చేయట్లేదు అని మాటలు వల్లిస్తున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్కులతో ఆయన ప్రజల్ని ఎలా నమ్మించగలరో చూడాలి.

దేవినేని ఉమని ఉతికి ఆరేసిన కొడాలి నాని