ఆర్థిక ఎమర్జెన్సీ కోసం రాష్ట్రాల వినతి!

కరోనా వైరస్ దెబ్బకు పదిరోజులుగా దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో.. తెలుగు రాష్ట్రాలు రెండూ మార్చి నెలాఖరు వచ్చే సమయానికి ఆర్థిక సంక్షోభం ముంగిట్లో నిల్చున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కొక్క తరహాలో…

కరోనా వైరస్ దెబ్బకు పదిరోజులుగా దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో.. తెలుగు రాష్ట్రాలు రెండూ మార్చి నెలాఖరు వచ్చే సమయానికి ఆర్థిక సంక్షోభం ముంగిట్లో నిల్చున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కొక్క తరహాలో ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు రాష్ట్రంలోని ఉద్యోగులు అందరికీ భారీగా కోతలు విధించారు. అదే సమయంలో జగన్ ఏపీలో కోతలు విధించకపోగా.. మార్చి నెల జీతాలు మాత్రం ఒకే దఫాగా కాకుండా రెండు విడతలుగా చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర కూడా కేసీఆర్ తరహాలో వేతనాల్లో కోతలు విధించే నిర్ణయానికి వచ్చింది.

అయితే అప్పుడే ముఖ్యమంత్రుల నిర్ణయాలపై ఉద్యోగ వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆల్ ఇండియా సర్వీస్ లో ఉండే ఐఏఎస్ అధికార్లకు కోతలు విధించడం కరెక్టు కాదని.. అది రాజ్యాంగ విరుద్ధమని ఒక వాదన బయల్దేరింది. ఆల్ ఇండియా సర్వీసుల్లో ఉన్నవారి వేతనాల్లో కోత పెట్టే విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది కాదని వారు అప్పుడే గోల పెడుతున్నారు.

అయితే దేశంలో ఇప్పుడున్న తీవ్రమైన పరిస్థితులకు ఆర్థిక ఎమర్జన్సీ విధించడం ఒక్కటే మార్గమనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో దేశంలో పలు  పత్రికలు, మేధావులు ఇలాంటి సలహాలు ఇస్తున్నారు. ఒక పత్రిక అయితే.. ఏకంగా ఆర్థిక ఎమర్జన్సీ విధించడానికి మోడీ నిర్ణయం తీసుకున్నట్లుగా కథనం అందించింది. వైరల్ కావడంతో దానిని ఏకంగా నిర్మలా సీతారామన్ ఖండించాల్సి వచ్చింది.

మరోవైపు అకౌంటబిలిటీ అండ్ సిస్టమేటిక్ ఛేంజ్ అనే సంస్థ ఏకంగా సుప్రీం కోర్టులో ఒక పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసింది. దేశంలో ఇప్పుడు ఆర్థిక ఎమర్జన్సీ విధించాల్సిన అవసరం ఉన్నదని, ఆ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టును ఆ పిటిషన్లో కోరారు. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తే గనుక.. రాష్ట్ర ప్రభుత్వాలే ఈ కోతలను సజావుగా నడిపించడానికి ఆర్థిక ఎమర్జన్సీ విధించాల్సిందిగా కేంద్రాన్ని కోరే అవకాశమూ కనిపిస్తోంది.

దేవినేని ఉమని ఉతికి ఆరేసిన కొడాలి నాని

ఇన్ని రోజులు ఒక ఎత్తు ఈ నాలుగు రోజులు ఒక ఎత్తు