స్వచ్ఛందంగా వైద్య పరీక్షలకు రండి, ప్లీజ్!

మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్ధన సమావేశాలకు హాజరైన వారిలో అత్యధికులకు కరోనా సోకిందనే వార్తలు ఇప్పుడు దేశాన్ని ఒక్క కుదుపు కుదుపుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ ప్రార్ధనలకు హాజరైన దాదాపు రెండు వేల మందిలో అత్యధికులకు…

మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్ధన సమావేశాలకు హాజరైన వారిలో అత్యధికులకు కరోనా సోకిందనే వార్తలు ఇప్పుడు దేశాన్ని ఒక్క కుదుపు కుదుపుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ ప్రార్ధనలకు హాజరైన దాదాపు రెండు వేల మందిలో అత్యధికులకు కరోనా సోకినట్లుగా నిర్ధరించారు. మిగిలిన వారిలో కొందరిని ట్రేస్ చేసి పట్టుకోవడంలో పోలీసులు, ప్రభుత్వాలు ఇంకా ఇబ్బంది పడుతున్నాయి. అయితే సంఘ హితాన్ని కాంక్షించి.. ఈ ప్రార్ధనలకు హాజరైన వారు దేశంలో, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నాసరే.. వారు తక్షణం తమ తమ కుటుంబాల సహా వైద్య పరీక్షలకు రావాల్సిన అవసరం ఉంది.

కరోనా సోకడం అనేది పాపం కాదు, నేరం కాదు. జాగ్రత్తలు ఇప్పుడున్నంతగా ప్రబలని సమయంలో వారు ప్రార్ధనలకు హాజరయ్యారు. అయిందేదో అయిపోయింది. కానీ.. ఆ ప్రార్ధన సమావేశాల్లో హాజరైన వారికి కరోనా సోకిందని తెలిసిన తర్వాత.. ఏ ఒక్కరూ కూడా ఇళ్లలో ఉండిపోవడం కరెక్టు కాదు. వారంతా పరీక్షలకు రావాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

ఇళ్ళలో ఉండిపోవడం వలన వారు మరింత ప్రమాదానికి చేరువ కావడమే  కాదు, తమ కుటుంబసభ్యుల, తమ పరిసరాల్లోని వ్యక్తుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేసినట్టు అవుతుంది. వారు రావడంతో పాటు, ఇన్నాళ్లుగా తాము ఎవరెవరిని కలిసామో వారందరి వివరాలు కూడా ఇస్తే వైద్య పరీక్షలు నిర్వహించడానికి,అందరి ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది.

ఒకవైపు మర్కజ్ నిజాముద్దీన్ జరిగిన వ్యవహారంలో తమ తప్పేమీ లేదన్నట్లుగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ సూచనలు, ఆదేశాలను ఎప్పటివప్పుడు తాము పాటించామని.. తమ తప్పు జరగలేదని అంటోంది. తమ కార్యాలయాన్ని ఇప్పటికైనా ,క్వారంటైన్ కేంద్రంగా మార్చుకోడానికి ఇస్తామని అంటోంది. అలా కాకుండా.. తమంత తాము స్వచ్ఛందంగా.. ఆ కార్యక్రమానికి వచ్చినవారందరితోను కమ్యూనికేట్ చేసి.. వారి వారి ప్రాంతాల్లో తక్షణం వైద్యపరీక్షలకు వెళ్లి ప్రభుత్వాలకు సహకరించాల్సిందిగా సూచనలు చేయాలి. అలాగే.. హాజరైన వారి జాబితాలను చిరునామాలతో సహా కూడా కేంద్రానికి, ఆయా రాష్ట్రాలకు పంపితే పరిస్థితిని చక్కదిద్దడానికి పనిచేసినట్లుంటుంది.

దేవినేని ఉమని ఉతికి ఆరేసిన కొడాలి నాని