కీలక ఘట్టానికి కరోనా కల్లోలం

ఏడవ తేదీ దగ్గరవుతోంది. మంచికో చెడ్డకో, ఈ యాంటీ సెంటిమెంట్ డేట్ తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఫేట్ ను డిసైడ్ చేయబోతోంది.  14 రోజుల్లో మానవ శరీరం పై ప్రభావం చూపించే ఈ వైరస్,…

ఏడవ తేదీ దగ్గరవుతోంది. మంచికో చెడ్డకో, ఈ యాంటీ సెంటిమెంట్ డేట్ తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఫేట్ ను డిసైడ్ చేయబోతోంది.  14 రోజుల్లో మానవ శరీరం పై ప్రభావం చూపించే ఈ వైరస్, తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందిని ఐసోలేషన్ వార్డులకు చేర్చబోతోందో అన్నది తెలిసిపోతుంది. ఇప్పటికే మార్చి 30, 31 రోజుల్లో కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఇది మరో రెండు రోజుల్లో కాస్త గట్టిగానే పెరిగే అవకాశం కనిపిస్తోంది.

అదృష్టం ఏమిటంటే, ఇప్పటికీ మన రాష్ట్రాల్లో దాదాపు రెండో స్టేజ్, మూడో స్టేజ్ కు మధ్యలో వుండడమే. మరీ ప్రమాద స్థాయికి చేరుకోకపోవడం. ఒక విధంగా లాక్ డౌన్ మంత్రం బాగానే పని చేస్తోంది. లాక్ డౌన్ మంత్రం కారణంగా కరోనా విస్తరణ మరీ అలార్మింగ్ స్టేజ్ కు చేరుకోకపోవచ్చు. అయితే అలా అని ఈరోజు అంకెలతో ఆగిపోతుందని లేదు.

ఏప్రియల్ ఏడవ తేదీ నాటికి తెలుగు నాట ఎవరెవరికి వైరస్ సొకింది అన్నదాంట్లో ఓ క్లారిటీ వస్తుంది. అలా సోకిన వారి వివరాలను బట్టి, ఎవరెవరు జాగ్రత్తగా వుండాలో అన్నది కూడా ఓ అంచనాకు అందుతుంది. దాని వల్ల మరో వారం వరకు వేచి చూడాలి. అందుకే ప్రధాని మోడీ 14 వరకు లాక్ డౌన్ పెట్టింది. అంటే 14 నాటికి మాగ్జిమమ్ నెంబర్ రీచ్ అయిపోతుంది. ఆ తరువాత కేసులు రావడం వుండదని కాదు, ఆ నాటికి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు 14 నాటికి ఓ క్లారిటీ వస్తుంది. కరోనా సోకింది అన్న అనుమానం వున్నవారి లెక్క చాలా వరకు తేలిపోతుంది.

కానీ ఆ సంఖ్య ఏ రేంజ్ లో వుంటుంది అన్నదే తెలియాల్సి వుంది. అమెరికా, ఇటలీ స్థాయిలో వుంటుంది అనే అంచనాలతోటే ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కీడెంచి మేలెంచాలన్న సామెతగా, లేదా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతతో ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. అందుకే భారీగా ఐసోలేషన్, వెంటిలేటర్ వార్డులను రెడీ చేస్తున్నాయి. ఇవన్నీ 10వ తేదీ నాటికి దాదాపు రెడీ చేస్తారు. 

మరో విషయం ఏమిటంటే 14 తరువాత కూడా లాక్ డౌన్ పొడిగిస్తే, దేశ జనాల ఆరోగ్యం సంగతి అలా వుంచితే, దేశ ఆర్థిక ఆరోగ్యం చెడిపోతోంది. వారం రోజుల లాక్ డౌన్ కే రాష్ట్రాలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించే పరిస్థితి వచ్చింది. అందువల్ల 14 తరువాత లిమిటెడ్ అవర్స్ లో అయినా లాక్ డౌన్ సడలించాల్సిందే. ఒకసారి సడలించిన  తరువాత జనాలను కంట్రోలు చేయడం అన్నది అసాధ్యం. లాక్ డౌన్ లోనే కంట్రోలు చేయడం కష్టం అవుతోంది.

అందువల్ల 14 నాటికి కరోనా సోకిందన్న అనుమానం వన్ పర్సంట్ వున్నా, అబ్జర్వేషన్ కోసం, ఐసొలేషన్ కో చేర్చి తీరాల్సిందే. అందువల్ల రాబోయే వారం రోజుల్లో కావచ్చు, రెండు వారాల్లో కావచ్చు, ఈ సంఖ్య కాస్త ఎక్కువే వుండే అవకాశం వుంది. కానీ దాన్ని బట్టి పానిక్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎన్ని కేసుల్లో క్లారిటీ వచ్చేస్తే అంత మంచిది. దాన్ని బట్టి లింక్ వున్నవారంతా జాగ్రత్త పడతారు. 

మొత్తం మీద కరోనా కల్లోల ఘట్టంలో రాబోయే వారం రోజులు కీలకం అనే చెప్పాలి. ఈ ఘట్టాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్దం అవుతున్నాయి. జనాలు కూడా మానసికంగా సిద్దం కావాలి. 14 తరువాత కూడా ఎవరికి సోకింది అన్న విచారణ లేకుండా వుండాలి అంటే జనాలు ఇళ్లకే పరిమతం కావాలి. అది మాత్రమే జనం చేయగలిగింది.

దేవినేని ఉమని ఉతికి ఆరేసిన కొడాలి నాని