కేరళ అలా …తెలంగాణ ఇలా …!

కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్ డౌన్. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇళ్లలోనుంచి బయటకు వెళితే ప్రాణాలకు ముప్పని చెబుతున్నాయి. బయటకు పోవద్దని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు దండం…

కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్ డౌన్. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇళ్లలోనుంచి బయటకు వెళితే ప్రాణాలకు ముప్పని చెబుతున్నాయి. బయటకు పోవద్దని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు దండం పెట్టి చెబుతున్నారు.

అయినప్పటికీ జనం వినడంలేదు. ఏదో ఒక విధంగా బయటకు పోతున్నారు. మామూలు వాళ్ళ సంగతి అలా ఉంచుదాం. వ్యసనపరులు మాత్రం ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ప్రధానంగా ముందుకు బానిసలైనవారు ఉండలేకపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా దేశమంతా మద్యం షాపులు కూడా బందయ్యాయి.

దీంతో మందు బాబులకు నిద్ర పట్టడంలేదు. మందుబాబుల్లో రకరకాల వారున్నారు. దేశీ మద్యం, విదేశాల మద్యం, కల్లు, సారా… ఇలాంటి సరుకంతా తాగేవారు అల్లాడిపోతున్నారు. చుక్క పడక కొందరికి చక్కర వస్తుంటే, కొందరికి మతిస్థిమితం తప్పుతోంది.

కొందరు పూర్తిగా పిచ్చివాళ్లవుతున్నారు. కొందరు వింతగా ప్రవర్తిస్తున్నారు. కొందరు మద్యం లేని బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో మద్యం దొరక్కపోవడంతో పిచ్చెక్కిపోయి, మతిస్థిమితం కోల్పోయి ఇప్పటివరకు పన్నెండుమంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

హైదరాబాదులోని ఎర్రగడ్డలో ఉన్న మెంటల్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ ప్రకటించినప్పటినుంచి రోగుల సంఖ్య పెరిగిందని ఆస్పత్రిలోని డాక్టర్లు చెబుతున్నారు. మతి  స్థిమితం కోల్పోయి ఆస్పత్రిలో చేరుతున్నవారిలో ఎక్కువమంది మద్యం దొరక్క మతిపోయినవారే. ఇక కొందరు మద్యం తగ్గని ఈ బతుకు ఎందుకని ప్రాణాలు తీసుకుంటున్నారు.

రెండు రోజుల కిందట మద్యం షాపులు తెరుస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. దీంతో అనేకమంది మందుబాబులు మద్యం దుకాణాల దగ్గర బారులు తీరారు. మద్యం షాపులు తీస్తారని ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశ నిరాశ అయింది. ఒక్క గంటైనా మద్యం షాపులు, కల్లు దుకాణాలు తెరవాలని మందుబాబులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కూడా.

దీనిపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కల్లు తాగకుంటే ప్రాణాలు  పోవని, కానీ కరోనా వస్తే మీరు పోవడమే కాకుండా వేరేవాళ్లు కూడా చనిపోతారని చీవాట్లు పెట్టారు. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది.

మందు తాగేవారు  ప్రతీ రాష్ట్రంలోనూ ఉన్నారు కదా. కేరళలోనూ మద్యం షాపులు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. మందు తాగక మతిస్థిమితం కోల్పోతున్నవారు అక్కడా ఉన్నారు. అక్కడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  దీంతో ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్ కు జాలి కలిగింది. సరే… డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో వచ్చినవారికి మద్యం అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు.

వీడు మందు తప్పనిసరిగా తాగాల్సిందే. అదే వీడికి మందు (మెడిసిన్) అని డాక్టర్ రాసిస్తే వాడికి మందు అమ్ముతారు. ఇలాంటి వెసులుబాటు కల్పిస్తే జనం ఊరుకుంటారా ? చాలామంది ప్రిస్క్రిప్షన్లు తెచ్చుకుంటారు. ఈ నిర్ణయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది.

ఇది తప్పుడు నిర్ణయమని చెప్పింది. మందుబాబులు మతిస్థిమితం కోల్పోతే వారికి చికిత్స చేయించాలని, అంతేగాని ఇలా మందు అమ్మకూడదని ఆక్షేపించింది. మందు బాబులకు చుక్క గొంతులో దిగితే వారు మామూలుగా ఉంటారా ? ఒక్కసారి మద్యం అమ్మడమంటూ మొదలుపెడితే జనం ఊరుకుంటారా? మందు దుకాణాలకు పోటెత్తిపోతారు కదా. సో …ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. 

న్ని రోజులు ఒక ఎత్తు ఈ నాలుగు రోజులు ఒక ఎత్తు

కుక్ గా మారిన ప్రదీప్