కరోనా మహమ్మారి పుట్టుక నెల మీద సందేహం వుంది కానీ పుట్టిన సంవత్సరం మీద సందేహం లేదు. 2019 నవంబర్, డిసెంబర్ లో కరోనా పుట్టింది అని ఇప్పటి వరకు అనుకుంటున్నది. మహా అయితే మరో ఒకటి రెండు నెలలు ముందు. కానీ ఇప్పుడు ఓ కొత్త పరిశోధన సంచలన విషయం చెబుతోంది. కరోనా పుట్టింది 2012లో అని ఆ పరిశోధన స్పష్టం చేస్తోంది.
అంతే కాదు, అందరూ అనుకున్నట్లు చైనాలోని వూహాన్ కరోనా జన్మస్థలం కాదని, దక్షిణ చైనాలోని మొజియాంగ్ లో వున్న రాగి గనుల్లో 2012లో తొలిసారి కరోనా వైరస్ తలెత్తిందని అంటున్నారు. మహరాష్ట్ర లోని పూనేకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు కరోనా వైరస్ పుట్టుక మీద కాస్త గట్టి పరిశోధనే చేసారు.
హార్స్ షూ రకం గబ్బిలాల ద్వారా మనుషులకు సోకుతుంది కనుక, అసలు ఇలా హార్స్ షూ రకం గబ్బిలాల ద్వారా మనుషులకు వైరస్ సోకిన సంఘటనలను ఈ శాస్త్ర వేత్తలు తవ్వి తీసారు. మొజియాంగ్ రాగి గనుల్లో గబ్బిలాలు తీవ్రంగా వుంటాయి. 2012లో వాటికి తొలిసారి ఈ వైరస్ సోకింది. ఆ రాగి గనికి శుభ్రం చేసే క్రమంలో కొందరు గని కార్మికలకు ఆ వైరస్ సోకింది.
ఆ వైరస్ సోకడంతో కలిగిన అస్వస్థత లక్షణాలు అన్నీ పక్కాగా కోవిడ్ లక్షణాలను పోలి వున్నాయని ఈ శాస్త్ర వేత్తలు గుర్తించారు. అప్పట్లో ముగ్గురు గని కార్మికులు మృతి చెందారు కూడా. అప్పటి రోగుల డయాగ్నస్టిక్ రిపోర్టులు, ఇప్పటి కోవిడ్ పేషెంట్ల రిపోర్టులు పోల్చి చూస్తే దాదాపుగా సరిపోతున్నాయట.
గమ్మత్తేమిటంటే పూనే శాస్త్ర వేత్తలు పరిశోధన చేసింది ఇప్పుడు కాదు. కరోనా ఫస్ట్ ఫేజ్ లోనే వారు తమ పరిశోధనకు శ్రీకారం చుట్టి గత ఏడాదికి మే లో నే ఈ మేరకు ఓ సైన్స్ జర్నల్ లో పరిశోధనా వ్యాసం ప్రచురించారు. దాని ప్రకారం కరోనా వైరస్ పుట్టిన ఇయర్ 2012. అంటే వచ్చే ఏడాదికి దానికి పదేళ్లు నిండుతాయన్నమాట.