ఓ టాప్ స్టార్ తో పీరియాడిక్ సినిమా చేస్తున్నారు ఓ పెద్ద డైరక్టర్. ఆయనకు ఓ పర్మనెంట్ రైటర్ వున్నారు. కానీ ఆ రైటర్ కామెడీలో కాస్త వీక్ అని అనుమానం.
ఇలాంటి నేపథ్యంలో కామెడీ ట్రాక్ లు బాగా రాయగలడు అని పేరున్న ఓ రైటర్ నుంచి పిలిచి కొన్ని సీన్లు రాయమని రిక్వెస్ట్ చేసారట. ఈ రైటర్ కూడా ఓకె అన్నాడు.
కానీ అక్కడే చిన్న ట్విస్ట్. ఈ ట్రాక్ లు రాసినందుకు డబ్బులు ఇస్తాము కానీ టైటిల్ కార్డ్ వేయమని ముందుగానే చెప్పేసారట సదరు డైరక్టర్. దాంతో అలా అయితే తాను రాయను గాక రాయనని చెప్పేసి వెనుదిరిగాడట ఆ రైటర్.
అసలే ఫ్యాన్స్ తో సదా జేజేలు పలికించుకునే హీరో సినిమా. అలాంటి సినిమాకు టైటిల్ కార్డ్ పడితే ఆ కిక్కే వేరుగా వుంటుంది. అందుకే ఆ డైరక్టర్ షరతుకు అప్రసన్నంతో నో చెప్పేసి వెనక్కు వచ్చినట్లు బోగట్టా.దాంతో ఆ డైరక్టర్ కు కళ్ల ముందు సినిమా చూపించేసినట్లు అయింది.