మైత్రీమూవీస్ వ్యవహారం చూస్తుంటే ఇచ్చిన అడ్వాన్స్ లు ఏదో విధంగా చెల్లుబాటు చేసుకోవడం, బాకీలు వసూలుకు సినిమాలు చేయడం అన్నట్లు కనిపిస్తోంది. అమర్ అక్బర్ ఆంథోని దారుణ పరాజయం తరువాత కూడా రవితేజతో మరో సినిమా అంటే ఇంకేం అనుకోవాలి. కానీ ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది.
'రభస' డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ సినిమా తెరి రీమేక్ గా ఈ సినిమా చేయబోతున్నారు. ఈ కథను పవన్ కళ్యాణ్ కోసం చేయించారు. ఆయన రాజకీయాల్లోకి జంప్,. తరువాత రవితేజతో బ్యాక్ టు బ్యాక్ రెండు అని కమిట్ అయ్యారు. కానీ కొన్ని సమస్యలు వచ్చి ఆగారు.
స్క్రిప్ట్ మీద ఖర్చు, డైరక్టర్ ఖర్చు, అడ్వాన్స్, హీరో అడ్వాన్స్ ఇన్నీకలిపి వెనక్కు తెచ్చుకోవడానికి ప్రాజెక్ట్ మీద ముందుకు వెళ్లాలనే డిసైడ్ అయిపోయారు. ఆ విషయాలు అన్నీ ఎలావున్నా, ఈ ప్రాజెక్ట్ కు కనకదుర్గ అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కృష్ణ అనే సినిమా చేసాడు గతంలో. ఇప్పుడు కనకదుర్గ మాంచి టైటిల్ నే అనుకోవాలి. ఆ కనకదుర్గ మైత్రీకి కాసులు కురిపిస్తుందేమో?