ఓ డైరక్టర్ వాయిస్ ఓవర్ చెబుతున్నారు అంటే ఎలా వుండాలి? ఓ టీజర్ కు వాయిస్ ఓవర్ చెప్పించడం అంటే ఎలా వుండాలి. ఇలాంటివి ఏవీలేకుండా, ఉప్పులేదు.. పప్పులేదు అన్నట్లు పరమ చప్పగా వుంటే ఏమనుకోవాలి. చిత్రలహరి టీజర్ లో దర్శకుడు సుకుమార్ వాయిస్ ఓవర్ వింటే అలాగే వుంది.
సాయిధరమ్ తేజ్-కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తయారైన చిత్రలహరి టీజర్ బయటకు వచ్చింది. నిజానికి ఈ టీజర్ చూసిన తరువాత అనిపించే విషయాలు రెండున్నాయి. ఒకటి.. ఈ టీజర్ కు ఈ వాయిస్ ఓవర్ అవసరమా? రెండవది.. వాయిస్ ఓవర్ ను సుకుమార్ ఇంత దారుణంగా చెప్పారేమిటి? అన్నది.
ఓ డైరక్టర్ ఇలా చెప్పడం ఏమిటో ఆయనకే తెలియాలి. అస్సలు రిజిస్టర్ కాలేదు డైలాగు. ఎవరో తరుముతున్నట్లు చెప్పుకుంటూ పోయారు. చిన్నపిల్లాడు ఏబిసిడీలు అప్పచెప్పేసినట్లు. ఏమాటకు ఆమాట.. ఈ వాయిస్ ఓవర్ సంగతి పక్కనపెడితే టీజర్ బాగుంది.
పాత్రల పరిచయం బాగుంది. అవును.. ఇంతకీ అయిదు పాత్రలు అనిచెప్పి, నాలుగు పాత్రలే పరిచయం చేసి, పాపం వెన్నెల కిషోర్ కు ఒక్క డైలాగు కూడా లేకుండా చేసారేమిటో?