Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సగం సినిమా తర్వాత సిక్స్ ప్యాక్ ఏంటో!

సగం సినిమా తర్వాత సిక్స్ ప్యాక్ ఏంటో!

పూరి జగన్నాధ్ అంతే. కథ సంగతి పక్కనపెడితే ముందు హీరో లుక్ పై విపరీతంగా ఫోకస్ పెడతాడు. అతడ్ని అప్పటివరకు ఎవరూ చూపించని కొత్త లుక్ లో చూపించడానికి తహతహలాడతాడు. ఇప్పుడీ 'జగన్నాధ మాయ'లో రామ్ కూడా పడినట్టున్నాడు. జిమ్ లో ఒకటే కసరత్తులు. సిక్స్ ప్యాక్ కోసం ట్రయింగ్ అంట.

జిమ్ లో వర్కవుట్ చేస్తున్న స్టిల్స్ ను రీసెంట్ గా విడుదల చేశాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ కోసమే రామ్ ఇలా కొత్తగా తయారవుతున్నాడనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు సిక్స్ ప్యాక్ కోసమే ప్రయత్నిస్తున్నాడంటూ యూనిట్ కూడా చెప్పేసింది. అంతా బాగానే ఉంది కానీ సగం షెడ్యూల్ పూర్తయిన తర్వాత సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నమేంటనేది అనుమానంగా మారింది.

అవును.. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే టాకీ సగం పూర్తయింది. మే నెలలో రిలీజ్ పెట్టుకున్నారు. ఇలాంటి టైమ్ లో కొత్త లుక్ కోసం ఎందుకీ ప్రయత్నం అనేది అందరి ప్రశ్న. రీసెంట్ గా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. దానికి డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ కూడా పెట్టారు. ఆ ప్రాజెక్టు కోసమే రామ్ ఇలా కసరత్తులు షురూ చేశాడంటున్నారు చాలామంది.

తన హీరోలందర్నీ సిక్స్ ప్యాక్ లో చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు పూరి జగన్నాధ్. చివరికి కల్యాణ్ రామ్ ను కూడా సిక్స్ ప్యాక్ లుక్ లో చూపించేశాడు. ఇప్పుడు రామ్ పై ఫోకస్ పెట్టాడు. ఆ ఫోకస్ ఏదో కథ, స్క్రీన్ ప్లే పైన పెడితే బాగుంటుందని పూరికి సోషల్ మీడియాలో సూచిస్తున్నారు నెటిజన్లు.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?