పవన్ గుజరాత్ వెళ్లి రావాలి

అవి మోడీ ప్రధాని కాక ముందు రోజులు. మోడీని ప్రధానిగా ప్రొజెక్ట్ చేస్తున్న రోజులు. భాజపాకు చెందిన ఓ పెద్దాయిన ఆంధ్ర నుంచి సినిమా ప్రముఖులను గుజరాత్ తీసుకువెళ్లి అక్కడి అభివృద్ది చూపించి, దానిని…

అవి మోడీ ప్రధాని కాక ముందు రోజులు. మోడీని ప్రధానిగా ప్రొజెక్ట్ చేస్తున్న రోజులు. భాజపాకు చెందిన ఓ పెద్దాయిన ఆంధ్ర నుంచి సినిమా ప్రముఖులను గుజరాత్ తీసుకువెళ్లి అక్కడి అభివృద్ది చూపించి, దానిని ఇక్కడ దండోరా వేయించే బాధ్యత తన భుజాల మీద వేసుకున్నారు. అలా వెళ్లిన పలువురిలో నాగార్జున, పవన్ కళ్యాణ్ తదితరులు వున్నారు.

ఓహో గుజరాత్ అంత బాగుంది..ఇంత బాగుంది అని అక్కడి ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయిన దగ్గర నుంచి తిరిగి వచ్చేవరకు సోషల్ మీడియాలో హడావుడి చేసారు. అదంతా అయింది. మోడీ ప్రధాని అయ్యారు. తిరుగులేని ప్రధానిగా ఏలుతున్నారు. పవన్ కళ్యాణ్ నేరుగా భాజపాతోనే పొత్తు పెట్టుకున్నారు. మళ్లీ పాచిపోయిన లడ్లు సాకుగా వదిలేసారు. ఆపైన మళ్లీ అదంతా మరచిపోయి పొత్తు పెట్టుకున్నారు. ఇప్పటికైతే ఆయన భాజపా స్నేహితుడు. సచివుడు.

ఇప్పుడు విషయం ఏమిటంటే..పవన్ కళ్యాణ్ ఆంధ్ర పాలిటిక్స్ లో యాక్టివ్ గా వున్నారు. ఆంధ్రలోని రోడ్ల పరిస్థితి మీద డిజిటల్ కాంపయిన్ రన్ చేయాలని వ్యూహరచన చేసారు. నిజానికి వర్షాకాలంలో రోడ్లు అన్నీ పాడవుతాయి. అందువల్ల ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఇదే అదను అన్నది ఆయన ప్లాన్ కావచ్చు. నిజానికి వర్షాకాలంలో రోడ్లు పాడయితే, వర్షాల తగ్గాక బాగు చేస్తారు. ఏ రాష్ట్రం అయినా ఇది కామన్.

ఆంధ్రలో రోడ్ల గురించి యాగీ చేయాలని పవన్ అనుకుంటున్నారు. కానీ ఆయనకు తెలుసో లేదో కానీ గుజరాత్ లో రోడ్ల దుస్థితి మీద ఇప్చటికే సోషల్ మీడియాలో విస్తృతంగా విమర్శలు మొదలైపోయాయి. అక్కడి రోడ్ల దారుణ పరిస్థితి మీద వీడియోలు షేర్ అవుతున్నాయి. 

ఏ గుజరాత్ ను అయితే జనాలకు మోడల్ గా చూపించి, పవన్ భాజపాకు దగ్గర అయ్యారో అదే గుజరాత్ కు ఇప్పుడు ఒక సారి పవన్ వెళ్లి వస్తే మంచింది. గతంలో ఆయన తన సినిమా కోసం గుజరాత్ వెళ్లి షూటింగ్ కూడా చేసి వచ్చారు. ఆ మెమరీస్ కూడా వుంటాయి.

అప్పుడు ఆంధ్ర మీద బురద జల్లోచ్చు. ముందు తన భాగస్వామి గురించి బాగా తెలుసుకుంటే మంచిది అన్న కామెంట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. లేదూ గుజరాత్ వెళ్లి వచ్చేంత తీరుబాటు లేకపోతే తనకు ఇష్టమైన నాయకుడు అయిన కేసిఆర్ పాలనలోని. హైదరాబాద్ రోడ్ల వీడియోలు కూడా ట్విట్టర్ లో తిరుగుతున్నాయి. వాటిని కూడా చూడొచ్చు.