కరోనా ఎఫెక్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం

కరోనా కారణంగా ఇప్పటికే తిరుమలలో శ్రీవారి దర్శనాల్ని రద్దుచేసిన టీటీడీ ఇప్పుడా నిర్ణయాన్ని పొడిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ఆధారంగా తాము కూడా వచ్చేనెల 14 వరకు భక్తులకు దర్శనాల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.…

కరోనా కారణంగా ఇప్పటికే తిరుమలలో శ్రీవారి దర్శనాల్ని రద్దుచేసిన టీటీడీ ఇప్పుడా నిర్ణయాన్ని పొడిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ఆధారంగా తాము కూడా వచ్చేనెల 14 వరకు భక్తులకు దర్శనాల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే భక్తులకు దర్శనభాగ్యం లేనప్పటికీ.. స్వామివారికి జరగాల్సిన పూజలు, సేవలన్నీ ప్రతి రోజూ నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది. భక్తులకు ఇన్ని రోజుల పాటు శ్రీవారి దర్శనభాగ్యం లేకుండాపోవడం తిరుమల చరిత్రలోనే ఇది తొలిసారి అంటున్నారు పండితులు.

భక్తుల రాకపోకలు లేకపోవడంతో.. తిరులకు దారితీసే రెండు మార్గాల్ని పూర్తిగా మూసేశారు. దీంతో తిరుమల కొండ నిర్మానుష్యమైంది. అటు సిబ్బంది కూడా అందరూ ఒకేసారి కాకుండా, బృందాలుగా విడిపోయి పనిచేస్తున్నారు. వారం రోజులకు ఒక బృందం చొప్పున షిఫ్ట్ పద్ధతిలో పనిచేస్తోంది. 

మరో 2 రోజుల్లో రానున్న శ్రీరామనవమి వేడుక కూడా కొండపై సాదాసీదాగా జరగబోతోంది. అత్యంత ఆర్భాటంగా, లక్షలాది మంది భక్తుల మధ్య జరిగే హనుమంత వాహన సేవను రద్దుచేసినట్టు ఇప్పటికే ప్రకటించిన టీటీడీ.. శ్రీవారి వార్షిక వసంతోత్సవాల్ని కూడా మండపంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించింది.

మరోవైపు భక్తుల రాకపోకలు లేకపోవడంతో బిచ్చగాళ్లు, అనాథలు, నిరుపేదల్ని ఆదుకునేందుకు టీటీడీ ముందుకొచ్చింది. రోజుకు 50వేల ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. తిరుపతి మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో టీటీడీకి సహకారం అందిస్తున్నారు.

కుక్ గా మారిన ప్రదీప్

క‌రొనా పై చిరు-నాగ్ పాట చూశారా?