కొత్త కాంబినేషన్.. సిద్దూ.. బొమ్మరిల్లు భాస్కర్

బొమ్మరిల్లు భాస్కర్.. ఎప్పుడో జమానా కాలం నాడు తీసిన బొమ్మరిల్లుతోనే పాపులర్. ఆ మధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తీసినా ఓకె అనిపించుకున్నారు తప్ప ట్యాగ్ లైన్ మార్చేంలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా…

బొమ్మరిల్లు భాస్కర్.. ఎప్పుడో జమానా కాలం నాడు తీసిన బొమ్మరిల్లుతోనే పాపులర్. ఆ మధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తీసినా ఓకె అనిపించుకున్నారు తప్ప ట్యాగ్ లైన్ మార్చేంలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా ఓకె అనిపించుకుంది. కానీ ఆ సినిమా తరువాత మళ్లీ కాస్త గట్టి గ్యాప్ నే వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఓ ప్రాజెక్ట్ భాస్కర్ చేతిలోకి వచ్చింది.

నిర్మాత బోగవిల్లి బాపినీడు ఓసినిమాను ప్లాన్ చేస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ హీరో. బొమ్మరిల్లు భాస్కర్ కథ, దర్శకత్వం. ఈ సినిమా ఈ నెల 10న ప్రారంభం కాబోతోంది. 

అయితే ఈ సినిమా కాకుండా మరో రెండు సినిమాలు సిద్దూ చేతిలో వున్నాయి. ఒకటి కోన నీరజ-పీపుల్స్ మీడియా సినిమా. రెండోది నందినీ రెడ్డి సినిమా. ఈ రెండూ కాకుండా టిల్లు స్వ్యేర్ ఇంకా పూర్తి కావాల్సి వుంది.

సిద్దుకు వున్న ఇమేజ్, టిల్లు సిరీస్ దృష్టిలో పెట్టుకుంటే బొమ్మరిల్లు భాస్కర్ పక్కాగా ఓ వెర్సటైల్ క్యారెక్టర్ ను తయారు చేసే వుండాలి. లేదూ అంటే సిద్దూ అంత సులువుగా ఓకె అనే రకం కాదు. అందువల్ల మంచి ప్రాజెక్ట్ కే శ్రీకారం చుడుతున్నారనుకోవాలి.