తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికే చివరి ప్రత్యక్ష ఎన్నిక అని జనం అనుకున్నారు. రాజకీయ నాయకులూ అనుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తమకు పని పడదని అనుకున్నారు. అనుకున్నవన్నీ జరిగితే రాజకీయాలు ఎందుకవుతాయి.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాగానే ఈటల రాజేందర్ ఎపిసోడ్ రంగం మీదికి రావడం, ఆయన్ని అవినీతిపరుడిగా ముద్రవేయడం (అసలు సంగతి తేలాల్సివుంది), దర్యాప్తు చేయించడం, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం, ఈటల బీజేపీ నాయకులతో మంతనాలు జరిపి ఆ పార్టీలో చేరిపోవడం …చకచకా జరిగిపోయిన సంఘటనలు.
తెలంగాణా రాజకీయ సినిమాలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనే కీలకమైన మలుపు వచ్చింది. రాజకీయ పార్టీలకు మళ్ళీ చేతినిండా పనిబడింది. వాస్తవానికి ఇది ఉప ఎన్నిక కాదు. కేసీఆర్ – ఈటల రాజేందర్ మధ్య వ్యక్తిగత పోరాటమని చెప్పొచ్చు. బీజేపీ అనే ఆయుధాన్ని ఆధారంగా చేసుకొని ఈటల రాజేందర్ కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నాడన్నమాట. కేసీఆర్ ఈటల రాజేందర్ ను ఉద్దేశించి ఇడిసిన ముల్లె అన్నాడు. అంటే ఈటలకు ఇప్పుడు విలువ లేదని చెప్పడమన్న మాట. బీజేపీ అభ్యర్థి ఈటల అనే సంగతి అందరికీ తెలుసు.
ఇక టీఆర్ఎస్ అభ్యర్థిని అన్వేషించాల్సి ఉంది. ఈటలకు దీటైన అభ్యర్థిని వెతకాల్సి ఉంటుంది. ఈటల మాత్రం తన గెలుపు మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. బీజేపీ బలం కంటే తన సొంత బలాన్ని ఈటల నమ్ముకున్నాడు. ఈటలను బీజేపీలో చేర్చుకోవడానికి అధిష్టానం గట్టి హామీ ఇచ్చే ఉంటుంది.
ఒక ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఈటల కనుక ఉప ఎన్నికలో గెలవకపోతే ఆయన్ను రాజ్యసభకు పంపే ఆలోచన చేస్తున్నారట. దీనికి ఈటల అంగీకారం ఉంటుందో ఉండదో తెలియదు. ఈటలకు కావాల్సింది టీఆర్ఎస్ మీద విజయం సాధించడం. తన సత్తా ఏమిటో కేసీఆర్ కు తెలియచెప్పడం.
తన పగ చల్లారడానికి ప్రత్యక్ష ఎన్నికలే మార్గం. రాజ్యసభ అనేది దొడ్డిదారి కదా. కొంతకాలం కిందట మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీని వదిలేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి ఒక మాటన్నాడు. టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఇద్దరికే ఉందని చెప్పాడు. అందరూ అంటున్నట్లు కేటీఆర్ కాదట.
హరీష్ రావు, ఈటల రాజేందర్ కు మాత్రమే సీఎం అయ్యే అర్హత ఉందట. దీన్నిబట్టి ఈటల ప్రజాదరణ ఉన్న నాయకుడని కొండా చెప్పాడన్న మాట. తనకు ప్రజాదరణ ఉందని ఈటల కూడా చెప్పాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ సీటును కూడా కోల్పోయిన బీజేపీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కించుకోలేని బీజేపీ హుజూరాబాద్ లో గెలుపుకోసం సర్వ శక్తులు ధారపోయడం గ్యారంటీ. ఉప ఎన్నిక బాధ్యత మంత్రి హరీష్ రావుకు కేసీఆర్ అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు.
గతంలో కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించే బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులెవరూ ఈటల వెంట పోకుండా చూసే బాధ్యత హరీష్ రావుకే అప్పగించారు. హరీష్ రావు జోక్యం తరువాత తాము టీఆర్ఎస్ లోనే ఉంటామని, కేసీఆరే తమ నాయకుడని చాలామంది నాయకులు మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. ఏది ఏమైనా తెలంగాణా ప్రజలు మరో ప్రతిష్టాత్మక పోరాటాన్ని చూడబోతున్నారు.