అప్పుడు అనుకున్నారు.. ఇప్పుడు సెట్ అయింది

ఎన్టీఆర్-అనిరుధ్.. ఈ కాంబినేషన్ ఇప్పటిది కాదు. చాన్నాళ్ల కిందటే సెట్ అవ్వాల్సిన జోడీ ఇది. కానీ అప్పుడు కుదరలేదు. ఇన్నాళ్లకు కుదిరింది. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేయబోయే సినిమాకు అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు.…

ఎన్టీఆర్-అనిరుధ్.. ఈ కాంబినేషన్ ఇప్పటిది కాదు. చాన్నాళ్ల కిందటే సెట్ అవ్వాల్సిన జోడీ ఇది. కానీ అప్పుడు కుదరలేదు. ఇన్నాళ్లకు కుదిరింది. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేయబోయే సినిమాకు అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు.

గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమా చేశాడు ఎన్టీఆర్. ఆ సినిమాకే అనిరుధ్ ను అనుకున్నారు. మూవీ లాంఛింగ్ కు కూడా అనిరుధ్ వచ్చాడు. కానీ ఆఖరి నిమిషంలో అనిరుధ్ ను తప్పించి ఆ స్థానంలో తమన్ ను తీసుకున్నారు. అప్పట్లో అజ్ఞాతవాసి ప్రభావం అందరిపై ఉండేది.

అలా ఎన్టీఆర్ సినిమాకు సంగీతం అందించే అవకాశం మిస్ అయ్యాడు అనిరుధ్. అయితే ఈ గ్యాప్ లో తమిళ్ లో ఇతడు కంపోజ్ చేసిన ట్యూన్స్ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. 

యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ కొల్లగొట్టడంతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేశాయి. దీంతో అనిరుధ్ ను మరోసారి ట్రాక్ పైకి తీసుకొచ్చాడు ఎన్టీఆర్. ఈ మొత్తం ఎపిసోడ్ లో దేవిశ్రీప్రసాద్ కు దెబ్బ పడింది. 

ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజీకి మ్యూజిక్ అందించిన ఈ సంగీత దర్శకుడు.. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమాకు మాత్రం సంగీతం అందించే ఛాన్స్ కోల్పోయాడు. ఈసారి అనిరుధ్ క్లిక్ అయితే మాత్రం ఇక్కడ పాతుకుపోవడం గ్యారెంటీ.