ముద్దు సీన్ రిహార్స‌ల్ కోస‌మ‌ని పిలిచి…

సినీ ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. ఇండ‌స్ట్రీ మ‌హిళ‌లు క‌రోనా నుంచైనా త‌ప్పించుకుంటున్నారు గానీ, ఏదో ర‌కంగా కాస్టింగ్ కౌచ్ బాధితులవుతున్నారు. ధైర్యంగా ఎదుర్కొంటున్న వాళ్లు ఇండ‌స్ట్రీలో కొంత కాలం నిల‌బ‌డ‌గ‌లుగుతున్నారు. లేదంటే చేదు…

సినీ ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. ఇండ‌స్ట్రీ మ‌హిళ‌లు క‌రోనా నుంచైనా త‌ప్పించుకుంటున్నారు గానీ, ఏదో ర‌కంగా కాస్టింగ్ కౌచ్ బాధితులవుతున్నారు. ధైర్యంగా ఎదుర్కొంటున్న వాళ్లు ఇండ‌స్ట్రీలో కొంత కాలం నిల‌బ‌డ‌గ‌లుగుతున్నారు. లేదంటే చేదు అనుభ‌వాల‌తో జీవితాన్ని గ‌డ‌పాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ హీరోయిన్ జ‌రీన్‌ఖాన్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో తాను ఎదుర్కొన్న చేదు అనుభ‌వాల గురించి చెప్పుకొచ్చారు.

జ‌రీన్‌ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ చాలా థ్రిల్లింగ్‌గా జ‌రిగింది. కాల్‌సెంట‌ర్‌లో ప‌నిచేసే జ‌రీనాఖాన్‌కు సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా సినిమాల్లో న‌టించాల‌నే ప‌ట్టుద‌ల‌తో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించారామె. స‌ల్మాన్‌ఖాన్ స‌ర‌స‌న వీర్ సినిమాలో హీరోయిన్‌గా అవ‌కాశాన్ని ద‌క్కించుకుని త‌న చిర‌కాల కోరిక నెర‌వేర్చుకున్నారు. 

మొద‌టి సినిమాలో న‌ట‌న మ‌రిన్ని అవ‌కాశాల‌ను తెచ్చి పెట్టింది. ‘హౌజ్‌ఫుల్‌ 2, హేట్‌ స్టోరీ 3, అక్సర్‌ 2’తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మ‌న‌సును చూర‌గొన్నారు. గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంలో జరీన్‌ ఖాన్‌ కీలక పాత్రలో న‌టించి టాలీవుడ్ ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం అయ్యారు.

తాజాగా ఆమె ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన అంశాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్ నుంచి తాను త‌ప్పించుకోలేకపోయిన‌ట్టు వాపోయారు. ఆ ఇంట‌ర్వ్యూలో ఆమె ఏం చెప్పారంటే…

‘బాలీవుడ్‌కు వచ్చిన కొత్తలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిశ్రమలో అతడి కంటే మంచి వ్యక్తి లేడనేలా నాతో ప‌ద్ధ‌తిగా మాట్లాడేవాడు. త‌న‌ సినిమాలో నటించే అవకాశం ఇప్పిస్తానని, అయితే అందులో ముద్దు సీన్‌ ఉంటుంద‌న్నాడు. దానికి మనం ముందే రిహార్సల్‌ చేద్దామని నన్ను పిలిచాడు. 

అలా నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మనసులోని భయాలన్నీ పక్కన పెట్టు అంటూ ఆ డైరెక్టర్‌ నాతో దారుణంగా ప్రవర్తించేవాడు. కానీ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ల పేర్లను ఇప్పుడు బయట పెట్టాల నుకోలేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

త‌న‌ను ఎలాగైనా లొంగ‌తీసుకోడానికి అత‌ను చేసిన వెకిలి చేష్ట‌ల్ని మ‌రిచిపోలేన‌ని ఆమె తెలిపారు. ఆ వ్యక్తి తన దారిలోకి తెచ్చుకోవాడానికి అనేక విధాలుగా ప్రయత్నించాడ‌ని చెప్పుకొచ్చారు. మనం స్నేహితలకంటే ఎక్కువగా ఉందామని, ఇక నా సినిమా ఆఫర్ల విషయాన్ని తాను చూసుకుంటానని నమ్మించాలని చూశాడ‌ని నాటి చేదు అనుభ‌వాల‌ని ఆమె పంచుకున్నారు. అయితే ఆ వ్య‌క్తి పేరు వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.