డిస్ట్రిబ్యూటర్ గా పెద్ద సినిమాలను క్రేజ్ తో కొనేసి బోర్లా పడతారేమో కానీ, చిన్న సినిమాల విషయంలో మాత్రం పక్కా కాలుక్యులేషన్ తో వుంటారు దిల్ రాజు. చిన్న సినిమాలు చూసి, ఇది ఇంత చేస్తుంది అని అంచనా వేసి, ఎన్ ఆర్ ఐ చేయడంలో ఆయన లెక్కలు సాధారణంగా తప్పవు. ఆయన పక్కా సేఫ్ జోన్ లో వుంటారు.
కళ్యాణ్ రామ్ హీరోగా, గుహన్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మించిన 118 సినిమాను ఆయన శిరీష్ తో కలిసిచూసి, ఆంధ్ర-నైజాం (సీడెడ్ మినహా) కలిపి అయిదుకోట్ల దగ్గర మొత్తానికి ఎన్ఆర్ఐ చేసారు. ఇప్పుడు ఫస్ట్ డే ఆంధ్ర, నైజాం కలిపి కోటిన్నర వరకు వచ్చింది.
చిన్న సినిమా కావడంతో అడ్వాన్స్ లు, ఫిక్స్ డ్ హైర్ లు అలాంటివి ఏవీలేవు. శనివారం నార్మల్ గా వున్నా, ఆదివారం, సోమవారం(శివరాత్రి) కలిపి, టోటల్ గా ఫస్ట్ వీడెండ్ కు దగ్గర దగ్గర ఆ అయిదు కోట్లు ఫిగర్ వచ్చేస్తుంది. అంటే అక్కడి దిల్ రాజు తానుపెట్టిన మొత్తాన్ని వెనక్కు తెచ్చేసుకుంటారు. ఆ తరువాత వచ్చింది, ఖర్చులు పోను ఓవర్ ఫ్లోస్ సంగతి తరువాత చూసుకోవచ్చు.
118 తొలిరోజు వసూళ్లు ఇలా వున్నాయి
నైజాం………54 లక్షలు
వైజాగ్………17
సీడెడ్………24
ఈస్ట్…………..9
వెస్ట్………….11
కృష్ణ…………11
గుంటూరు…..16
నెల్లూరు………3.5