మహేష్‌బాబుకి సినిమా నిర్మాణంపై మొదట్నుంచీ ఆసక్తి వుంది. అప్పట్లో తన సినిమాలకి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. పారితోషికం కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటానంటూ తాను నటించిన చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించాడు. అయితే అది మహేష్‌కి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో తర్వాత నిర్మాణం జోలికి పోలేదు. కానీ ఇప్పుడు 'మేజర్'తో మళ్లీ నిర్మాతగా మారాడు.
మహేష్ సంస్థలో అడివి శేష్‌తో ఒక ద్విభాషా చిత్రం రూపొందడం హాట్ టాపిక్ అయింది. సోనీ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న మహేష్ తను నటించే చిత్రాలకి మాత్రం నిర్మాణంలో భాగం పంచుకోవడానికి ఇంకా రెడీగా లేడు. మహర్షి కానీ, తర్వాత చేయబోయే మైత్రి మూవీస్ లేదా అనిల్ సుంకర చిత్రాలకి గానీ మహేష్ నిర్మాణ భాగస్వామ్యం తీసుకోవడం లేదు.
జిఎంబి – ఘట్టమనేని మహేష్‌బాబు సినిమాస్‌లో మీడియం బడ్జెట్ చిత్రాలు, వెబ్ సిరీస్ మాత్రమే తీయాలని చూస్తున్నాడు తప్ప హై రిస్క్ వుండే భారీ బడ్జెట్ చిత్రాల గురించి మహేష్ ఇప్పుడు థింక్ చేయట్లేదు. నిర్మాతగా స్థిరపడిన తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ లెవల్ చిత్రాల గురించి ఆలోచిస్తాడని భావించవచ్చు.