మళ్లీ విదేశాలకు మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు విదేశాలకు వెళ్తున్నారు. ఈ మధ్యనే ఆయన రెండు మూడు దేశాల్లో హాలీడేస్ గడిపి వచ్చారు. సర్కారు వారి పాట తరువాత విదేశాలకు వెళ్లారు. Advertisement త్వరలో త్రివిక్రమ్ డైరక్షన్…

సూపర్ స్టార్ మహేష్ బాబు విదేశాలకు వెళ్తున్నారు. ఈ మధ్యనే ఆయన రెండు మూడు దేశాల్లో హాలీడేస్ గడిపి వచ్చారు. సర్కారు వారి పాట తరువాత విదేశాలకు వెళ్లారు.

త్వరలో త్రివిక్రమ్ డైరక్షన్ లో హారిక హాసిని నిర్మించే సినిమాను స్టార్ట్ చేయాల్సి వుంది. అయితే మళ్లీ ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు.

అయితే ఈసారి విదేశాలకు వెళ్లేది వెకేషన్ కు కాదు. కొడుకు గౌతమ్ ను విదేశాల్లోని కాలేజీల్లో చేర్పించడానికి అని వినిపిస్తోంది. 

ఏ కాలేజీ, ఏ కోర్సు, ఏ దేశం అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలో తెలుస్తాయి. కానీ ప్రస్తుతం గౌతమ్ ఇంటర్ ఇక్కడే జాయిన్ అయ్యాడు. అందువల్ల మళ్లీ మార్చి విదేశాల్లో వేస్తున్నారా? అన్నది క్లారిటీ లేదు.

ఈ కొత్త ప్రోగ్రాం కారణంగా త్రివిక్రమ్ సినిమా ఆగస్ట్ నుంచి ప్రారంభం అవుతుంది. జూలైలో ప్రారంభం అవుతుందనుకున్నారు. కానీ మహేష్ విదేశాలకు వెళ్లి వచ్చాక ప్రారంభిస్తారు.