ఆ సినిమా చూస్తే క‌రోనా గురించి తెలుస్తుందంటున్న న‌టి!

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైర‌స్ వ్యాప్తి గురించి తెలుసుకోవాల‌నే కుతూహ‌లం ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉంది. అయితే అది ఎలా అనేదే ప్ర‌శ్న‌గా మిగులుతోంది. ఈ నేప‌థ్యంలో సంచ‌ల‌న‌టి,…

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైర‌స్ వ్యాప్తి గురించి తెలుసుకోవాల‌నే కుతూహ‌లం ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉంది. అయితే అది ఎలా అనేదే ప్ర‌శ్న‌గా మిగులుతోంది. ఈ నేప‌థ్యంలో సంచ‌ల‌న‌టి, అందాల ముద్దుగుమ్మ‌గా పేరు గ‌డించిన న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ స‌రికొత్త విష‌యాల‌ను చెబుతోంది.

క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రిచేందుకు త‌న వంతు బాధ్య‌త‌గా ఆమె సోష‌ల్ మీడియాలో ఓ వీడియో విడుద‌ల చేసింది. ఈ వీడియోలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు వైర‌స్ వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు ఏం చేయాలో కూడా సూచించింది.

ప్ర‌ధాని మోడీ పిలుపు మేర‌కు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్లోనే ఉండాల‌ని, ఉంటున్నార‌ని భావిస్తున్న‌ట్టు ఆమె తెలిపింది. అలాగే తాను కూడా ఇంట్లోనే ఉంటున్న‌ట్టు ఆమె చెప్పింది. క‌రోనా ఎవ‌రికైనా సోక వ‌చ్చ‌ని వివ‌రించింది. మ‌రీ ముఖ్యంగా క‌రోనా లాంటి వైర‌స్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలుసుకోవాలంటే  కాంటేజెయన్‌ అనే ఇంగ్లీష్ సినిమా చూడాల‌ని ఆమె సూచించింది. ఆ సినిమా చూస్తే క‌రోనా వైర‌స్ వ్యాప్తి గురించి అర్థం చేసుకోవ‌చ్చ‌ని ఆమె వెల్ల‌డించింది.

ఈ లాక్‌డౌన్ కాలంలో చుట్టు పక్కల పిల్లలు, వృద్ధులకు సహాయం చేయాల‌ని ఆమె వేడుకొంది. అలాగే ఇళ్లు, దుకాణాల అద్దెలను ఈ నెల ఆలస్యంగా తీసుకుంటే మంచిదని కూడా సూచించింది. ఇలా అనేక సామాజిక అంశాల‌ను ఆమె ఆ వీడియోలో ప్ర‌స్తావించారు. 

వీటితో కూడా జాగ్రత్తగా ఉండండి

మనదగ్గర 20 కోట్ల మందికి రావచ్చు