ఎట్ట‌కేల‌కు కెమెరాకు ప‌ట్టుబ‌డిన క‌రోనా మ‌హ‌మ్మారి

ఎట్ట‌కేల‌కు క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) కెమెరాకు ప‌ట్టుబ‌డింది. దాని ఫొటోలు మొట్ట మొద‌టిసారిగా మ‌న దేశంలో విడుద‌ల‌య్యాయి. కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ సూక్ష్మ‌జీవిని పుణెలోని ఐసీఎమ్ఆర్‌- ఎన్ఐవీ శాస్త్ర‌వేత్త‌లు ట్రాన్స్‌మిష‌న్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్…

ఎట్ట‌కేల‌కు క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) కెమెరాకు ప‌ట్టుబ‌డింది. దాని ఫొటోలు మొట్ట మొద‌టిసారిగా మ‌న దేశంలో విడుద‌ల‌య్యాయి. కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ సూక్ష్మ‌జీవిని పుణెలోని ఐసీఎమ్ఆర్‌- ఎన్ఐవీ శాస్త్ర‌వేత్త‌లు ట్రాన్స్‌మిష‌న్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా ఫొటోల‌ను తీసి ప్ర‌జ‌ల ముందుకు తెచ్చారు.

ఈ సంద‌ర్భంగా శాస్త్ర‌వేత్త‌లు కొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించారు. జ‌న‌వ‌రి 30న భార‌త్‌లో క‌రోనా తొలి కేసు న‌మైంద‌న్నారు. ఆ కేసుకు సంబంధించి థ్రోట్ స్వాబ్ (గొంతుకు సోకిన ఇన్‌ఫెక్ష‌న్ గుర్తించేందుకు చేసే వైద్య ప‌రీక్ష‌) నుంచి వీటిని సంగ్ర‌హించిన‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి నుంచి సేకరించిన శాంపిల్స్‌లోని జన్యుక్రమం… చైనాలోని వుహాన్‌లో బయటపడ్డ సార్స్‌-కోవ్‌-2(కరోనా వైరస్‌) జన్యుక్రమంతో 99.98 శాతం సరిపోలిందని శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.

కాగా పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్‌ఐవీ) ప‌రిశోధ‌న‌లు చాలా ఆశాజ‌న‌కంగా ఉన్నాయి. ఈ సంస్థ ప‌రిశోధ‌న‌ల‌కు సంబంధించి వివ‌రాలు, ఫొటోల‌ను ఇండియ‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్‌లో పొందుప‌రిచారు.  ఐసీఎమ్‌ఆర్‌-ఎన్‌ఐవీ నేషనల్‌ ఇన్‌ఫ్లూయెంజా సెంటర్‌ టీం ‘ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపి ఇమేజింగ్‌ ఆఫ్‌ సార్స్‌-కోవ్‌-2’ పేరుతో వ్యాసం ప్ర‌చురిత‌మైంది.

అంతేకాదు, భారత్‌లో కరోనా వైరస్‌ ఫొటోలను తొలిసారిగా తామే విడుదల చేసినట్లు పుణె సంస్థ పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా శ్వాసకోశ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ప్రాణాంతక పరిస్థితి సంభవిస్తుందని పేర్కొంది.  ఈ వైరస్‌కు సంబంధించిన కచ్చితమైన పరిణామక్రమం, మార్ఫాలజీ(ఆకృతి) గురించి మాత్రం ప‌రిశోధ‌న‌ల్లో పూర్తిస్థాయిలో క‌నుగొనాల్సి ఉంది. అయితే ఫుణెలో ఇంత వ‌ర‌కు జ‌రిగిన ప‌రిశోధ‌న‌లు మాత్రం త్వ‌ర‌లో క‌రోనా వైర‌స్ పుట్టు పూర్వోత్త‌రాల‌ను క‌నుగొనే అవ‌కాశం ఉంద‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తున్నాయి.

మేము సైతం

మనదగ్గర 20 కోట్ల మందికి రావచ్చు