ఒక్క పాటతో జాతకం మార్చేస్తున్నాడు

సిడ్ శ్రీరామ్‌కి తెలుగు సంగీత ప్రియులనుంచి దక్కుతోన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అతను ఏ పాట పాడినా కానీ దానిని లక్షల సార్లు వినేస్తున్నారు. దీంతో సిడ్ శ్రీరామ్‌తో పాట పాడిస్తే ఎన్నో…

సిడ్ శ్రీరామ్‌కి తెలుగు సంగీత ప్రియులనుంచి దక్కుతోన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అతను ఏ పాట పాడినా కానీ దానిని లక్షల సార్లు వినేస్తున్నారు. దీంతో సిడ్ శ్రీరామ్‌తో పాట పాడిస్తే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడితే కానీ రాని పబ్లిసిటీ వచ్చేస్తోంది. అందుకే మామూలుగా సింగర్లకి అయిదు వేల పారితోషికం ఇస్తే అతనికి మాత్రం అయిదు లక్షల వరకు ఇస్తున్నారు. 

‘గీత గోవిందం’తో మొదలు పెట్టి మొన్నటి ‘అల వైకుంఠపురములో’ వరకు సిడ్ శ్రీరామ్ పాట చేసిన మ్యాజిక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అందుకే ప్రతి దర్శకుడు, నిర్మాత కూడా అతనితో పాట పాడించమని సంగీత దర్శకులకి ప్రత్యేకంగా చెబుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ పాటలు అంత హిట్ అవడానికి బీజం వేసిన సిడ్‌తో తమన్ ‘వకీల్ సాబ్’ కోసం కూడా పాట పాడించాడు. 

టీవీ యాంకర్ ప్రదీప్ హీరోగా రూపొందుతోన్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిన్న చిత్రానికి సిడ్ శ్రీరామ్ పాట సూపర్ పబ్లిసిటీ తెచ్చింది. అతను పాడిన ‘నీలి నీలి ఆకాశం’ పాటకి యూట్యూబ్‌లో ఇప్పటికి డెబ్బయ్ మిలియన్ల వ్యూస్ వచ్చాయి. స్టార్ హీరోల పాటలకి కూడా ఈ స్థాయి స్పందన అంత తేలిగ్గా రాదు. ఒక్క పాటతో చిన్న సినిమాల జాతకాన్ని కూడా అతనెలా మార్చేస్తున్నాడనే దానికి ఇంతకుమించి ఉదాహరణ అక్కర్లేదు.

మేము సైతం

మనదగ్గర 20 కోట్ల మందికి రావచ్చు