దిల్ రాజు బ్యానర్ లో అఖిల్

సురేంద్ర రెడ్డి – అనిల్ సుంకర కాంబినేషన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు హీరో అఖిల్. ఈ సినిమా షూట్ ఇంకా వుండగానే తరువాత సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది.  Advertisement నిర్మాత దిల్…

సురేంద్ర రెడ్డి – అనిల్ సుంకర కాంబినేషన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు హీరో అఖిల్. ఈ సినిమా షూట్ ఇంకా వుండగానే తరువాత సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది. 

నిర్మాత దిల్ రాజు కు అఖిల్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఆస్ధాన దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పిన కథకు అఖిల్ ఓకె చెప్పినట్లు తెలుస్తోంది.

వేణు శ్రీరామ్ ఎప్పటి నుంచో సినిమా కోసం వెయిటింగ్. బన్నీ హీరోగా ఐకాన్ సినిమా చేయాలని అలా వేచి వున్నాడు. ఇప్పటికి క్లారిటీ వచ్చినట్లుంది. ఇప్పట్లో ఆ సినిమా చేతిలోకి రాదు అని. అందుకే వేరే కథను అఖిల్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఏజెంట్ సినిమా తరువాత ఆ సినిమా స్టార్ట్ అవుతుంది.

దిల్ రాజు బ్యానర్ లో చేయడం అఖిల్ కు ఇదే తొలిసారి. నిజానికి వేణు శ్రీరామ్ వేరే బ్యానర్ లో సినిమా చేయాల్సి వుంది. కానీ దానికి హీరో ఇంకా ఫైనల్ కాలేదు. అందుకే ముందుగా అఖిల్ ప్రాజెక్టు టేకప్ చేస్తున్నారు.