నాని-విక్రమ్ కుమార్- గ్యాంగ్ లీడర్

గ్యాంగ్ లీడర్..మెగాస్టార్ కు ఇష్టమైన టైటిల్ Advertisement సాయి ధరమ్ తేజ వాడతారని వినిపించిన టైటిల్ ఇప్పుడు ఈ టైటిల్ ను నాచురల్ స్టార్ నాని వాడేస్తున్నారని బోగట్టా. డైరక్టర్ విక్రమ్ కుమార్ తో…

గ్యాంగ్ లీడర్..మెగాస్టార్ కు ఇష్టమైన టైటిల్

సాయి ధరమ్ తేజ వాడతారని వినిపించిన టైటిల్

ఇప్పుడు ఈ టైటిల్ ను నాచురల్ స్టార్ నాని వాడేస్తున్నారని బోగట్టా. డైరక్టర్ విక్రమ్ కుమార్ తో కలిస హీరో నాని చేస్తున్న సినిమాకు ఈ టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నాని బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది.

సాధారణంగా విక్రమ్ కుమార్ అన్నా, నాని అన్నా గ్యాంగ్ లీడర్ లాంటి టైటిల్ ను అస్సలు అంచనా వేయరు ఎవ్వరూ. విక్రమ్ కుమార్ టైటిళ్లే డిఫరెంట్ గా వుంటాయి. అలాంటి డైరక్టర్, నానితో కలిసి చేస్తున్న సినిమాకు ఈ క్రేజీ టైటిల్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

రేపు కనుక గ్యాంగ్ లీడర్ టైటిల్ అనౌన్స్ మెంట్ వస్తే, నాని ఫ్యాన్స్ ఫిదా కావడం గ్యారంటీ. ఎందుకంటే ఆ టైటిల్ క్రేజ్ అలాంటిది కదా?