చంద్రబాబు డొంకతిరుగుడు దొంగ ప్రేమ

ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి చంద్రబాబునాయుడు ఒక లేఖ రాశారు. కరోనా ప్రభావంతో రాష్ట్రం మొత్తం షట్ డౌన్ అయిపోయిన వేళ.. అనేక రంగాలు కుదేలైపోతున్న సంగతి తెలిసిందే. అయితే వారిలో కొందరి…

ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి చంద్రబాబునాయుడు ఒక లేఖ రాశారు. కరోనా ప్రభావంతో రాష్ట్రం మొత్తం షట్ డౌన్ అయిపోయిన వేళ.. అనేక రంగాలు కుదేలైపోతున్న సంగతి తెలిసిందే. అయితే వారిలో కొందరి గురించి చంద్రబాబు నీలం సాహ్నికి వినతిపత్రంలాంటి లేఖ రాశారు. ఆ లేఖను జాగ్రత్తగా గమనిస్తే.. అత్యంత డొంకతిరుగుడుగా.. దొంగ ప్రేమ కురిపిస్తూ రాసిన లేఖగా కనిపిస్తుందని ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్ సందర్భంగా అనేక ఉత్పాదక వ్యవసాయ రంగాలు ఏకంగా షట్ డౌన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ.. కేవలం కరోనా మహమ్మారిని సమూలంగా అంతమొందించడమే లక్ష్యంగా.. ప్రజలను సమాజాన్ని కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వాలు కఠినంగా లాక్ డౌన్ అమలుచేస్తూ.. పేదలకోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వ్యవసాయ రంగానికి కొన్ని మినహాయింపులున్నాయి. అయితే చంద్రబాబు ఇప్పుడు కొత్తగా మరో అంశం తెరపైకి తెచ్చారు.  

కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యాన, పౌల్ట్రీ, ఆక్వా రంగాలు చాలా ఇబ్బంది పడుతున్నాయనేది తాజాగా చంద్రబాబు లేఖలోని సారాంశం. ఆ రంగాలు ఇబ్బంది పడుతున్నాయి గనుక.. రవాణా వ్యవస్థ లేకపోగా.. మద్దతు ధరలేనందున నష్టపోతున్నారని.. వ్యవసాయ రంగం సంక్షోభం బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు కోరారు.

నిజానికి ఆయన తన లేఖలో పేర్కొన్న రంగాలు.. వ్యవసాయం కోటాలోకి రావు. ఉద్యానవన పంటల సంగతి కాస్త భిన్నం. దానిని మినహాయిస్తే.. ప్రధానంగా పౌల్ట్రీ, ఆక్వా రంగాలు.. ఎప్పటికప్పుడు తమ రంగాలు పరిశ్రమల కిందికి వస్తాయా, వ్యవసాయం కిందికి వస్తాయా అనే స్టాండ్ మార్చుకుంటూ ఉంటారు. ఈ రెండు రంగాలకు పరిశ్రమలుగా మాత్రమే ప్రస్తుతానికి గుర్తింపు ఉంది.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా.. ఉచిత కరెంటు వంటి సదుపాయాలు పొందడానికి తమ రంగాలను వ్యవసాయం కింద గుర్తించాలని. ఆ రెండు రంగాలనుంచి అనేక మంది.. చంద్రబాబుకు విన్నవించుకున్నారు. అయితే ఆయన పట్టించుకోలేదు. అప్పుడు వారికోసం ఏ నీర్ణయమూ తీసుకోకపోగా.. ఇప్పుడు మాత్రం.. వారిని వ్యవసాయం కింద ఆదుకోవాలని అనడం చంద్రబాబు ప్రదర్శిస్తున్న కపటప్రేమకు నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ట్రిక్కులు ఆయన మానుకోవాలని సూచిస్తున్నారు. 

ఆంధ్రాకి పోవాలా.. ఈ క్యూలైన్ చుడండి

అందర్నీ చూసుకుంటా.. ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి