ఎన్టీఆర్ నుంచి రానాకు కమీషన్

తండ్రి సురేష్ బాబులాగే హీరో రానా కూడా మాంచి బిజినెస్ ఐడియాలు వున్న వ్యక్తి. సినిమాల్లోకి హీరోగా రాకముందు నుంచే వ్యాపారాల్లో ఆయన అడుగు పెట్టారు. లేటెస్ట్ గా ఒక పక్కన సినిమాలు చేస్తూనే…

తండ్రి సురేష్ బాబులాగే హీరో రానా కూడా మాంచి బిజినెస్ ఐడియాలు వున్న వ్యక్తి. సినిమాల్లోకి హీరోగా రాకముందు నుంచే వ్యాపారాల్లో ఆయన అడుగు పెట్టారు. లేటెస్ట్ గా ఒక పక్కన సినిమాలు చేస్తూనే హీరో, హీరోయిన్ల డేట్లు, కొత్త వారి పరిచయం, అలాగే వారి బ్రాండింగ్ వంటివి చూసే క్వాన్ అనే సంస్థను స్టార్ట్ చేసారు. ముందు దాన్ని హైదరాబాద్ లో స్టార్ట్ చేసి, చెన్నయ్ కు విస్తరించారు కూడా.

లేటెస్ట్ అప్పీ ఫిజ్ పానీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ ను నియమించారు. రెండేళ్లపాటు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు. ఇందుకు గాను ఎన్టీఆర్ కు మూడు కోట్లకు పైగా మొత్తం పారితోషికంగా లభిస్తున్నట్లు బోగట్టా.

అయితే ఇందులో పదిశాతం రానా కంపెనీకి కమీషన్ గా వెళ్తుందట. ఎందుకంటే అప్పీ ఫిజ్ కు, ఎన్టీఆర్ కు మధ్య ఈ డీల్ సెట్ చేసింది రానాకు చెందిన క్వాన్ కంపెనీనే అంట. అంటే మొత్తంమీద ఎన్టీఆర్ ఇమేజ్ మీద రానా ముఫైలక్షల వరకు సంపాదంచారన్నమాట.