ఏప్రియల్ 5న జెర్సీ, అదేనెల 26న మహర్షి విడుదల వుంటుందని ఇప్పటికి ఖరారయిన విషయం. అయితే ఈ రెండు సినిమాల డేట్ లు మారే అవకాశం వుందని తెలుస్తోంది. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి నటించిన చిత్రం జెర్సీ. ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తయింది. కానీ సంగీత దర్శకుడు అనిరుథ్ తోనే సమస్య. ఆయన ఇంకా ఒకటి రెండు ట్యూన్ లు ఇవ్వాల్సి వుందని తెలుస్తోంది.
ఆ ట్యూన్ లు రావాలి, పాటలు రెడీ కావాలి. అలాగే బ్యాలెన్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తవ్వాలి. ఇవన్నీ నెలలోపు జరిగిపోవాలి. సినిమా చివర మాంచి ఉత్కంఠ భరితమైన రంజీ మ్యాచ్ వుంటుంది. దానికి రీరికార్డింగ్, సిజి, ఇతరత్రా వర్క్ చాలా కీలకంగా వుంటుంది. అందువల్ల సమయం సరిపోతుందా? అన్నది చూడాలి.
ఇక మహర్షి సినిమాకు కూడా ఇదే పరిస్థితి. ఆ సినిమా వర్క్ మెల్ల మెల్లగా జరుగుతోంది. పైగా ఎన్నికల షెడ్యూలు మధ్యలో మహర్షి డేట్ ఇరుక్కునే అవకాశం వుందని తెలుస్తోంది. అందువల్ల మార్చి ఫస్ట్ వీక్ లో ఎన్నికల షెడ్యూలు కనుక తెలిస్తే, ఆ మేరకు విడుదల డేట్ ను ఓవారం అటు ఇటుగా జరిపే అవకాశం వుంది.
మహర్షి డేట్ కనుక మారిస్తే జెర్సీ డేట్ ను ఏప్రియల్ 18కి మార్చే అవకాశం వుంది. లేదూ అంటే కిందామీదా పడయినా ఏప్రియల్ 5న విడుదలకు రెడీ చేస్తారు. అదేరోజు నాగచైతన్య-సమంతలల మజిలీ విడుదల కూడా వుంది.