‘పక్కా’గా కన్నీరు..పన్నీరు

పక్కా కమర్షియల్ సినిమా నిర్మాతలకు కానీ దర్శకుడు మారుతి కి కానీ ఒక కంట కన్నీరు..ఒక కంట పన్నీరు అన్నట్లు మిగిలింది. థియేటర్ పరంగా చూసుకుంటే దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది.  Advertisement అసలే…

పక్కా కమర్షియల్ సినిమా నిర్మాతలకు కానీ దర్శకుడు మారుతి కి కానీ ఒక కంట కన్నీరు..ఒక కంట పన్నీరు అన్నట్లు మిగిలింది. థియేటర్ పరంగా చూసుకుంటే దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది. 

అసలే జనం థియేటర్ కు రావడం లేదు. పోనీ రప్పించగల సత్తా సినిమాలో వుందా అంటే అదీ లేదు. మారుతిని గుడ్డిగా నమ్మారో, లేక మారుతి తన స్క్రిప్ట్ ను అతిగా నమ్మారో మొత్తానికి తప్పు జరిగిపోయింది.

కానీ థియేటర్ దగా చేస్తే నాన్ థియేటర్ ఆదుకుంది. ముఫై కోట్ల వరకు హిందీ, శాటిలైట్, డిజిటల్ హక్కుల మొత్తం వచ్చింది. అది ఆనందం. సినిమాకు 36 కోట్ల వరకు ఖర్చయింది. అక్కడికి ఆరు కోట్ల డెఫిసిట్ మిగిలింది. 

థియేటర్ వసూళ్లు దగ్గర దగ్గర నాలుగు కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. అందువల్ల ప్రస్తుతానికి గట్టెక్కిపోయారు. సినిమాను స్వంతంగా పంపిణీ చేసుకున్నారు. తీసుకున్నవి అడ్వాన్స్ లే.

త్వరలో మరో రెండు మూడు సినిమాలు గీతా నుంచి వస్తున్నాయి. ఈ అడ్వాన్స్ ల బ్యాలన్స్ అక్కడ పనికి వస్తుంది. అందువల్ల గీతాకు పెద్దగా సమస్య లేదు. కానీ మారుతి కి మాత్రం రెండోసారి మచ్చపడిపోయింది. ఈసారి అయినా తనకు తట్టింది రాసీ, తనకు తోచింది తీసీ అన్నట్లుగా కాకుండా జాగ్రత్తపడడం అన్నది చాలా అవసరం.