అమ‌లాపాల్ రెండో పెళ్లి…అంతా ఉత్తుత్తిదే!

ప్ర‌ముఖ హీరోయిన్ అమ‌లాపాల్ రెండో పెళ్లి…అంతా ఉత్తుత్తిదే. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా ఓ త‌మిళ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేశారు. త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్‌తో విడాకులు తీసుకున్న త‌ర్వాత అమ‌లాపాల్…

ప్ర‌ముఖ హీరోయిన్ అమ‌లాపాల్ రెండో పెళ్లి…అంతా ఉత్తుత్తిదే. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా ఓ త‌మిళ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేశారు. త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్‌తో విడాకులు తీసుకున్న త‌ర్వాత అమ‌లాపాల్ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ఆమె వాటిని ఖండిస్తూనే ఉన్నారు. 

తాజాగా త‌న ప్రియుడైన ముంబై బేస్డ్ సింగ‌ర్ భ‌వీంద‌ర్ సింగ్‌తో లిప్ లాక్ కిస్ పెడుతున్న ఫొటోల‌తో పాటు పెళ్లి సంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపించ‌డంతో …అమ‌లాపాల్ రెండో పెళ్లి చేసుకుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. భ‌వీంద‌ర్‌సింగ్‌ను కుటుంబ స‌భ్యులు, బంధువుల స‌మ‌క్షంలో పెళ్లాడిన‌ట్టు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. త‌న పెళ్లి వార్త‌ల‌పై అమ‌లా కూడా స్పందించ‌లేదు. దీంతో అంతా నిజ‌మేన‌నుకున్నారు. 

అయితే ఈ వార్త‌ల నేప‌ధ్యంలో తాజాగా ఆమె ఓ తమిళ న్యూస్ చానెల్‌తో ముచ్చ‌టించారు. అమ‌లా త‌న రెండో పెళ్లి  ప్ర‌చారాన్ని ఖండించారు. తాను రెండో పెళ్లి చేసుకోలేదని.. నెట్‌లో ఉన్న ఫోటోలు తాను భాగస్వామిగా ఉన్న ఓ సంస్థ కోసం చేసిన ఫొటో షూట్‌ కోసం మాత్ర‌మేన‌ని  అని ఆమె  స్పష్టం చేశారు. 

అయితే త‌న పెళ్లి స‌మాచారాన్ని అంద‌రికీ ముందే చెబుతాన‌ని గ‌తంలో అనేక‌సార్లు ఆమె చెప్పారు. భవీందర్‌తో అమ‌లాపాల్‌ ప్రేమాయణం పెళ్లికి దారి తీస్తుందా లేక‌…. అనే అనుమానాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏది ఏమైనా మీడియాకు మాత్రం అమ‌లాపాల్ పెళ్లి వార్త ఎప్ప‌టికీ హాట్ టాపిక్కే.

ఇంట్లో కాలుమీద కాలేసుకుని దేశసేవ చేసే టైమొచ్చింది

బైట తిరిగితే సీరియస్ యాక్షన్