ఎట్టెట్టా…క‌రోనా చైనా కుట్రా?

క‌రోనా వైర‌స్ వ్యాప్తిలో చైనా దేశ కుట్ర దాగి ఉందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఈ ఆరోప‌ణ‌కు బ‌లం చేకూర్చేలా అనేక ఉదంతాలు చెప్పుకోవ‌చ్చు. ప్ర‌పంచంలో అగ్ర‌రాజ్యంగా పెత్త‌నం చెలాయిస్తున్న అమెరికా ఆర్థిక…

క‌రోనా వైర‌స్ వ్యాప్తిలో చైనా దేశ కుట్ర దాగి ఉందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఈ ఆరోప‌ణ‌కు బ‌లం చేకూర్చేలా అనేక ఉదంతాలు చెప్పుకోవ‌చ్చు. ప్ర‌పంచంలో అగ్ర‌రాజ్యంగా పెత్త‌నం చెలాయిస్తున్న అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కుప్ప‌కూల్చ‌డ‌మే ల‌క్ష్యంగా క‌రోనా వైర‌స్‌ను చైనా సృష్టించింద‌నే ఆరోప‌ణ‌లు ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి విన‌వ‌స్తున్నాయి. అంతేకాకుండా ఈ ఆరోప‌ణ‌ల‌కు బ‌లాన్నిచ్చే ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా ఆయా దేశాలు వెల్ల‌డిస్తున్నాయి. 

మొట్ట మొద‌ట అనుమానం గురించి చ‌ర్చించుకుందాం. ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్ ర‌ష్యా, ఉత్త‌ర కొరియా దేశాల్లో ఎందుకు వ్యాపించ‌లేదు? ఆ దేశాల్లో క‌నీసం ఒక్క‌టంటే ఒక్క క‌రోనా కేసు కూడా ఎందుకు న‌మోదు కాలేద‌నేదే ప్ర‌ధాన ప్రశ్న‌. ర‌ష్యా, ఉత్త‌ర కొరియాలు చైనాకు అత్యంత శ‌క్తిమంత‌మైన మిత్ర‌దేశాలు. క‌రోన బారిన ప‌డ‌కుండా చైనా ముంద‌స్తుగా ఆ దేశాల‌ను అప్ర‌మ‌త్తం చేసింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

చైనాలోని వూహాన్ క‌రోనాకు కేంద్ర‌బిందువు. ఒక్క వూహాన్ మిన‌హా చైనాలో మ‌రే న‌గరానికి, ప్రాంతానికి క‌రోనా వైర‌స్ విస్త‌రించ‌క‌పోవ‌డం కూడా అనేక సందేహాల‌కు తావిస్తోంది. ప్ర‌పంచంలోని చాలా దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను, స్టాక్ మార్కెట్ల‌ను క‌రోనా ఛిన్నాభిన్నం చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రి వూహాన్‌లో మాత్రం చాలా త్వ‌రిత‌గ‌తిన క‌రోనా నుంచి ఎలా రిక‌వ‌రీ కాగ‌లిగార‌నే ప్ర‌శ్న‌కు చైనా మాత్రం స‌మాధానం చెప్ప‌డం లేదు.

కానీ విశ్లేష‌కుల అభిప్రాయాలు తెలుసుకుంటే చైనా కుట్ర‌కు దిమ్మ తిర‌గ‌క‌మాన‌దు. క‌రోనా అనేది చైనా సృష్టే అని కొంద‌రు బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు. ఎందుకంటే క‌రోనా వైర‌స్‌కు చైనా విరుగుడు మందు(యాంటీ డోట్‌)ను ఎంతో ముందుగా క‌నుగొంది.  త‌న‌కు మిత్ర దేశాలైన ర‌ష్యా, ఉత్త‌ర కొరియా దేశాల‌కు ఈ మందును ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా చైనా స‌ర‌ఫ‌రా చేసింది. అందువ‌ల్లే ర‌ష్యా, ఉత్త‌ర కొరియా దేశాలు సుర‌క్షితంగా మ‌నుగ‌డ సాగిస్తుండ‌టం విశేషం.

చైనా త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలైన భార‌త్‌లాంటి  ఆర్థిక వ్య‌వ‌స్థల‌ను ధ్వంసం చేసే కుట్ర‌లో భాగంగానే క‌రోనా వైర‌స్ వ్యాప్తి అనే సందేహాలు త‌లెత్తుతున్నాయి. ఎక్క‌డైతే క‌రోనా పుట్టిందే ఆ దేశం మాత్రం కేవ‌లం రోజుల వ్య‌వ‌ధిలో బ‌య‌ట‌ప‌డింది. కానీ మిగిలిన దేశాలు మాత్రం దిక్కుతోచ‌ని స్థితిలో గ‌జ‌గ‌జ‌లాడుతున్నాయి. ప్ర‌పంచంలో ఏ దేశానికి, శ‌క్తికి త‌ల‌వంచ‌ని అగ్ర‌రాజ్య‌మైన అమెరికా…నేడు కంటికి క‌నిపించ‌ని సూక్ష్మ జీవి అయిన క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు చిగురుటాకులా వ‌ణికిపోతోంది. 

క‌రోనా వైర‌స్‌తో పాటు విరుగుడుకు మందు క‌నిపెట్ట‌డం వ‌ల్లే ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ వూహాన్‌లో ధైర్యంగా ప‌ర్య‌టించాడ‌ని చెబుతున్నారు. అంతేకాకుండా కేవ‌లం మాస్క్ మాత్ర‌మే త‌గిలించుకుని, మిగిలిన ర‌క్ష‌ణ క‌వ‌చాలైన ప్రొటెక్టివ్ గౌన్లు, గ్లౌవ్స్ ధ‌ర‌లించ‌లేద‌ని అమెరికా లాంటి దేశాలు మండిప‌డుతున్నాయి. 

ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా స‌రికొత్త దాన తెర‌మీద‌కి వ‌స్తోంది. వైరస్‌ డ్రాగన్‌ సృష్టే అనే అనుమానాలు నిజమైతే.. నెలలోగా అమెరికా, భార‌త్ త‌దిత‌ర చైనా శ‌త్రు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలాక.. కరోనా విరుగుడును కనిపెట్టామని చైనా ప్రకటిస్తుందనే వార్త‌లు వినిపిస్తున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి పడిపోయి కోలుకోలేనంత దెబ్బ‌తిన‌గా.. ఒక్క చైనా స్టాక్‌ మార్కెట్లు మాత్రమే లాభాల్లో న‌డుస్తుండ‌టం గ‌మ‌నార్హం.

తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు…చైనాపై అనేక అనుమానాలు క‌లిగిస్తోంది. అమెరికా లాంటి అగ్ర‌దేశం కరోనాపై ఏం చేయాలో తెలియ‌ని స్థితిలో ఉండ‌టం ఆశ్చ‌ర్యం, ఆందోళ‌న క‌లిగిస్తోంది. అమెరికా ప‌రిస్థితే అలా ఉంటే….మిగిలిన దేశాల సంగ‌తేం చెబుతాం అనే నిరాశ‌నిస్పృహ మాట‌లు వినిపిస్తున్నాయి.

బైట తిరిగితే సీరియస్ యాక్షన్