కరోనా ప్రభావం ఎప్పటి వరకు?

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, ఎవరికైనా ఇదే సందేహం.. 31 వరకు ఇల్లు కదల కూడదు అంటున్నారు. ఆ తరువాత పరిస్థితి ఏమిటి? కదలొచ్చా? ఇంకా పొడిగిస్తారా? అసలు కరోనా అన్నది కంట్రోల్ లోకి…

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, ఎవరికైనా ఇదే సందేహం.. 31 వరకు ఇల్లు కదల కూడదు అంటున్నారు. ఆ తరువాత పరిస్థితి ఏమిటి? కదలొచ్చా? ఇంకా పొడిగిస్తారా? అసలు కరోనా అన్నది కంట్రోల్ లోకి వస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు.

పరిస్థితి చూస్తుంటే ఈ వ్యవహారం ఇప్పటితో ముగిసేలా లేదు. మార్చి 31 తరువాత కనీసం మరో నెల రోజులు అయినా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మనమందరం తీసుకుంటున్నవి నివారణ చర్యలు కాదు, నిరోధక చర్యలు. కరోనా వ్యాప్తి చెందకుండా ఎక్కడి వారిని అక్కడ కట్టడి చేస్తున్నారు. అంతవరకు బాగానే వుంది.

కానీ 100 కోట్ల జనాభా వున్న ఈ దేశంలో ఇప్పటికి ఐడెంటిఫై చేసిన వందల మందిని డిశ్ఛార్జి చేయాల్సి వుంది. మరెక్కడా అనుమానితులు లేరు అని తేలాల్సి వుంది. అంతా అయిపోయింది, ఇక నో ప్రోబ్లెమ్ అని వదిలేస్తే, పొరపాటున రాష్ట్రానికి ఒక్కరికి వున్నా అలుముకుంటూ పోతుంది. ఆ భయం ఇప్పటికి ఇప్పుడే పోయేది కాదు.

ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికే 31 నుంచి ఏప్రియల్ 15 వరకు కావాల్సిన టెన్త్ పరిక్షలు వాయిదా వేసింది. పైగా ఎప్పుడు నిర్వహించేది చెప్పడం లేదు. తరువాత చెబుతాం అంటోంది. అంటే ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో క్లారిటీ లేదని అర్థం అవుతోంది. 

విదేశాలు పూర్తిగా కరోనా ఫ్రీ అయ్యేవరకు విదేశీ విమానాలు ఎగరవు. రాష్ట్రాలు అన్నీ కరోనా ఫ్రీ అయ్యే వరకు రైళ్లు, విమానాలు తిరగవు.  కరోనా ఫ్రీ కావాలి అంటే వంద కోట్ల జనాభాలో అనుమానితులను గుర్తించడం, టెస్ట్ లు నిర్వహించడం, క్వారెంటైన్ లో  వుంచడం, ఇవన్నీ జరగాల్సిన పనులు. కానీ అంత సులువుగా తేలేవి కాదు. 

అందువల్ల ప్రతి ఒక్కరు ఈ పరిస్థితికి మానసికంగా ప్రిపేర్ కావాల్సింది వుంది. కనీసం ఈ సమ్మర్ వరకు అయినా కరోనా కష్టాలు తప్పకపోవచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బైట తిరిగితే సీరియస్ యాక్షన్