కెరీర్ తొలినాళ్లలో ఒక థర్డ్ గ్రేడ్ తరహా సినిమాలో నటించింది అమలపాల్. ప్రియుడి తండ్రితో ఎఫైర్ పెట్టుకునే ఒక అమ్మాయి పాత్ర అది. ఆ సినిమా చూస్తేనే తలతిరిగిపోతుంది సామాన్య జనాలకు. అంత థర్డ్ గ్రేడ్ కాన్సెప్ట్ తో, అదే తరహా సీన్లతో ఆ సినిమాను రూపొందించారు. అలాంటి సినిమాల్లో చేసిన అమల ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించేంత స్థాయి వరకూ ఎదగడం నిజంగా గొప్ప సంగతే.
మరి కెరీర్ విషయంలో అలా మంచి స్థాయికి చేరిన అమల ఆ తర్వాత శరవేగంగా తప్పటడుగులు వేసినట్టుగా ఉంది. తొందరగానే పెళ్లి చేసేసుకుంది, అయితే ఆ తర్వాత ఆ పెళ్లిలో సెటిల్ కాలేదు. సినిమా దర్శకుడనే పెళ్లి చేసుకున్నా, కొంత కాలానికే విడిపోయారు. ఆ సమయంలో అమల గురించి వచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఒక తమిళ హీరోతో ఎఫైర్ అనే వార్త తీవ్రంగా వచ్చింది. అయితే ఆ హీరోనేమో ఇప్పుడూ స్టార్ గానే ఉన్నాడు. అమల వైవాహిక జీవితం వేరయ్యింది. అదేం పెద్ద విషయం కాకపోకపోవచ్చు సినీ ప్రపంచంలోని వారికి. కానీ ఆ తర్వాతే అమల రకరకాల ప్రకటనలతో వార్తల్లోకి వచ్చింది.
మాజీ భర్త మీద ప్రేమ ప్రకటించుకుంది. ఆ తర్వాత మరో ఎఫైర్, భువీందర్ సింగ్ తో ప్రేమాయణం, పెళ్లి అయ్యిందనే ప్రచారం, ఫొటోలు డిలీట్, తాజాగా అమల స్పందిస్తూ… తమ పెళ్లే కాలేదని, అదంతా ఒక ఫొటో షూట్ అంటూ ప్రకటించింది. మరోవైపు భువీందర్ సింగ్ ఒక బిగ్ షాట్ అని, అమలతో అతడు ఆల్రెడీ బ్రేకప్ చెప్పేశాడని కూడా తమిళ మీడియా వార్తలను ఇచ్చింది.
ఒక దశలో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అమలపాల్ ప్రస్తుత పరిస్థితి ఇది. వివాహం, ఎఫైర్, మళ్లీ ఎఫైర్.. ఆఖరికి పెళ్లి ఫొటోలు కూడా ఫొటో షూట్ అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చినట్టుందేమో! ఈ పరిస్థితిని అమల ఎలా తీసుకుంటోందో కానీ.. ఈ పరిణామాలన్నీ ఆమెపై ఫ్యాన్స్ లో జాలి కలిగేలా చేస్తూ ఉన్నాయి.