ఇపుడు కానీ మా బాబుంటేనా!

ఏ బాబు అనుకోమాకండి. ఆయనే మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన చేతిలో అధికారం పోయి దాదాపుగా ఏడాది కావస్తోంది. బాబు ఇంకా తాను ముఖ్యమంత్రిగా ఇప్పటికీ ఊహించుకుంటారు. ఆయన పార్టీ తమ్ముళ్ళదీ  కూడా…

ఏ బాబు అనుకోమాకండి. ఆయనే మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన చేతిలో అధికారం పోయి దాదాపుగా ఏడాది కావస్తోంది. బాబు ఇంకా తాను ముఖ్యమంత్రిగా ఇప్పటికీ ఊహించుకుంటారు. ఆయన పార్టీ తమ్ముళ్ళదీ  కూడా అదే తీరు.

ఇక టీడీపీ హయాంలో కొన్ని ఉన్నత  పదవుల్లో కుదురుకున్న వారి స్వామి భక్తి అయితే చెప్పనవసరం లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు కరోనా వైరస్ వచ్చి లోకాన్ని గడగడలాడిస్తోంది. ఆ వైరస్ కి ఎటువంటి మందు లేదన్నది అందరికీ తెలిసిందే.

అమెరికా పెద్దన్న ట్రంప్ నుంచి  అభివ్రుధ్ధి చెందిన అనేక దేశాలు ఏం చేయాలో తోచక విలవిల్లాడిపోతున్నాయి. కరోనా నివారణకు మందు లేదు, నియంత్రణ ఒక్కటే మార్గం. నియంత్రణ అంటే ఎవరికి వారు తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చుని స్వీయ నిర్బంధనం చేసుకోవడమే.

ఇపుడు దేశంలోని అన్ని ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు అదే చేస్తున్నారు. కానీ టీడీపీకి మాత్రం ఏపీ ముఖ్యమంత్రిగా   చంద్రబాబు ఉంటే ఇలా ఉండేది కాదని, ఆయన అసలు కరోనా అన్నది ఏపీకి రాకుండా ఎక్కడో పొలిమేర్లలో ఆపేసేవాడన్న భ్రాంతి ఉంది.

దాన్ని జనాల్లో చర్చకు పెడుతూ రాజకీయ సయ్యాటకు తెర తీస్తున్నారు. కరోనా వైరస్ విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందంటూ ఘాటు విమర్శలు చేస్తూనే మా బాబు ఇపుడు కనుక ఉండి ఉంటే ఇలా జరిగేదా అంటూ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.

ఆయన హుదూద్ తుఫాన్ ఆపేసిన మొనగాడు, అనేక యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు, ఆయన్ని పక్కన కూర్చోబెట్టి తప్పు చేశామన్న రాజకీయ వైరస్ ని జనాల్లోకి పంపిస్తూ ఆత్మానందం పొందుతున్నారు. మొత్తానికి కరోనాని కూడా వదలకుండా స్వీయ రాజకీయం చేసుకుంటున్న తమ్ముళ్ళ బుర్రలను ఎంత పెట్టి కొనాలో.

బైట తిరిగితే సీరియస్ యాక్షన్

400 ఏళ్ల భాగ్యనగరి చరిత్రలో తొలిసారి ఇలా