కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాల కు అండగా నిలిచేందుకు సెల్రబిటీలు ముందుకు వస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన సినిమాల వర్కర్లకు కొంత సాయం ప్రకటించారు. రాజశేఖర్ సినిమా కార్మికులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. తమిళ సూపర్ స్టార్ సూర్య అక్కడి జనాల కోసం సాయం ప్రకటించారు.
తెలుగు సినిమా టాప్ సెలబ్రిటీలు మాత్రం తమ తమ ఫొటోలతో, విడియోలతో సోషల్ మీడియాను నింపుతున్నారు. గంట కొడుతూ ఫొటో తప్పట్లు కొడుతూ విడియో, పళ్లెం కొడుతూ ఫొజు ఇలా ఇవే ఎక్కడ చూసినా, స్వచ్ఛ్ భారత్ ఆరంభంలో తెలుగు సినిమా టాప్ సెలబ్రిటీలు అంతా ఇలాగే చీపుర్లు, చేటలు పట్టుకుని ఫోజులు ఇచ్చారు.
అయితే వీరందరికి దూరంగా హీరో నితిన్ మాత్రం తన వంతు సాయంగా ఆంధ్ర, తెలంగాణలకు చెరో పదిలక్షలు ప్రకటిస్తున్నాడు. ఈ మేరకు కాస్సేపట్లో ప్రకటన చేయబోతున్నారు. బహుశా ఇది స్ఫూర్తిగా మిగిలిన వారు కూడా ముందుకు వచ్చే అవకాశం వుంది.