దేశానికి కాలసర్ప దోషమట!

భారత దేశం ఇపుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ విషయం చెప్పడానికి ఏ జ్యోతీష్యం అవసరం లేదు. ఎవరో చక్రాలు వేసి చూపించాల్సిన పనీ లేదు. కరోనా వైరస్  రూపంలో దేశంలో విలయతాండవం చేస్తున్న…

భారత దేశం ఇపుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ విషయం చెప్పడానికి ఏ జ్యోతీష్యం అవసరం లేదు. ఎవరో చక్రాలు వేసి చూపించాల్సిన పనీ లేదు. కరోనా వైరస్  రూపంలో దేశంలో విలయతాండవం చేస్తున్న విష పురుగు ఒకటి ఉన్నదని తెలిసిన తరువాత నుంచి జనం మనసులో భయం, భీతి రెట్టింపు అయ్యాయి.

ఏం జరుగుతుంది. రేపు ఎలా ఉంటుందన్న టెన్షన్ ప్రతీ వారిలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే భారత దేశం కాలసర్ప  దోష పీడతో బాధపడుతోందని విశాఖకు  చెందిన శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామీజీ  అంటున్నారు. దీని వల్లనే సర్వానర్ధాలు దేశానికి ప్రాప్తించాయని కూడా అయన అంటున్నారు.

ఈ నేపధ్యంలో విష గాలులు,  పీడల జాడ లేకుండా దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లేలా యాగాలను, హోమాలను గత వారం రోజులుగా శారదాపీఠంలో చేయిస్తున్నారు. ఈ నెలాఖరు వరకూ పీఠంలో హోమంలో యాగాలు కొనసాగుతాయని స్వామీజీ అంటున్నారు.

హోమాలలో మండే ధాతువుల ద్వారా జనించిన వాయువుతో విషగాలుల కరోన వైరస్ లాంటి పీడలు తొలగిపోతాయని స్వామీజీ అంటున్నారు. మొత్తానికి సైన్స్ తన పని తాను చేస్తూంటే ఆధ్యాత్మిక వేత్తలు వారి బాటలో కరోనాపైన సమరం చేస్తున్నారు.

ఏది ఫలించినా జనాలకు మేలు, ఉపశమనం కలుగుతాయి. ఈ సమయంలో ఆశగా అన్ని వైపులా చూడడమే మానవుల కర్తవ్యంగా ఉంది.

అయితే తమన్ లేదంటే దేవీశ్రీ.. అనుప్ కి ఏమైంది?

400 ఏళ్ల భాగ్యనగరి చరిత్రలో తొలిసారి ఇలా