నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 18 పేజీస్.
అల్లు అరవింద్ సమర్పణ, బన్నీ వాస్ ప్రొడ్యూసర్, సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే. ఇవన్నీ సినిమాకు క్రేజ్ తెచ్చే ప్లస్ పాయింట్లు.
జూన్ 1 న హీరో బర్త్ డే. సో ఏదో ఒక కంటెంట్ విడుదల చేయాల్సిందే. అందువల్ల 18 పేజెస్ ఫస్ట్ లుక్ ను ఆ రోజు ఇవ్వబోతున్నారు. ఆ మేరకు ఓ అనౌన్స్ మెంట్ పోస్టర్ విడుదల చేసారు.
నిఖిల్ కల్ట్ లుక్స్ తో ఉన్న స్టిల్ తో ఈ పోస్టర్ అట్రాక్టివ్ గానే వుంది. డైరెక్టర్ గోపీ సుందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల అవ్వనున్నాయి.