అనవసరంగా కెలకడం ఎందుకు – గోపీచంద్

గోపీచంద్ తండ్రి పెద్ద డైరక్టర్. తీసినవి తక్కువ సినిమాలే అయినా చరిత్రలో నిలిచిపోయే కొన్ని సినిమాలు తీశారు. మరి గోపీచంద్ ఎందుకు డైరక్షన్ ట్రై చేయలేదు. దర్శకత్వంపై ఆయన ఆలోచన ఏంటి? Advertisement పక్కా…

గోపీచంద్ తండ్రి పెద్ద డైరక్టర్. తీసినవి తక్కువ సినిమాలే అయినా చరిత్రలో నిలిచిపోయే కొన్ని సినిమాలు తీశారు. మరి గోపీచంద్ ఎందుకు డైరక్షన్ ట్రై చేయలేదు. దర్శకత్వంపై ఆయన ఆలోచన ఏంటి?

పక్కా కమర్షియల్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇదే ప్రశ్న గోపీచంద్ కు ఎదురైంది. తనకు డైరక్షన్ కు సంబంధించి అన్ని విషయాలు తెలుసంటున్నాడు ఈ హీరో. కానీ మెగా ఫోన్ మాత్రం పట్టనంటున్నాడు.

“డైరక్షన్ కు సంబంధించి అన్ని విషయాలు నాకు తెలుసు. కానీ ఫుల్ మూవీ చేయాలంటే దర్శకుడిగా చాలా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం చాలా చేయాల్సి ఉంటుంది. నేను అంత ప్రిపేర్ అవ్వలేదు. పైగా డైరక్షన్ అనేది ప్రాక్టికల్ గా నాకు రాదు. రాని విషయాన్ని అనవసరంగా కెలకడం ఎందుకు?”

ప్రస్తుతం యాక్టింగ్ కెరీర్ లో బిజీగా ఉన్నానని, డైరక్షన్ చేయడం కంటే తనకు యాక్టింగ్ చేయడం ఈజీ అని చెప్పుకొచ్చాడు గోపీచంద్. భవిష్యత్తులో యాక్టింగ్ లోనే కొత్తగా ఏదైనా ట్రై చేస్తాడంట ఈ హీరో. అంతేతప్ప డైరక్షన్ జోలికి మాత్రం పోనంటున్నాడు.