100 అంటే 147 ఎలా?

పక్కా కమర్షియల్ ఆంధ్రలోని సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలకే టికెట్ అని నిర్మాతలు ప్రకటించారు. దీనికి జిఎస్టీ అదనం. అంటే 28 పర్సంట్ కలపాలి. అంటే 128 కి టికెట్ విక్రయించాలి. కానీ…

పక్కా కమర్షియల్ ఆంధ్రలోని సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలకే టికెట్ అని నిర్మాతలు ప్రకటించారు. దీనికి జిఎస్టీ అదనం. అంటే 28 పర్సంట్ కలపాలి. అంటే 128 కి టికెట్ విక్రయించాలి. కానీ వైజాగ్ పంపిణీదారు అయిన దిల్ రాజు తన థియేటర్లలో 147 కు అమ్ముతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి.

ఒక పక్క టికెట్ రేట్లు తగ్గించాలన్న ఆలోచన స్టార్ట్ చేసింది దిల్ రాజు నే. ఇప్పుడు దానినే అందరూ ఫాలో అవుతున్నారు. మరి అలాంటపుడు ఆయన థియేటర్లలోనే అదనంగా అమ్మడం అంటే ఏమనుకోవాలి? 

అసలే నిర్మాత బన్నీ వాస్, యువి వంశీ టికెట్ రేట్లు తక్కువ అన్నది ప్రచారం చేయడానికి కిందా మీదా అవుతున్నారు. ఇప్పుడు ఇలా అదనంగా అమ్మితే ఇక జనం ఈ ప్రచారాన్ని ఎలా నమ్ముతారు?

పైగా ఎవరో ఎగ్జిబిటర్లు ఇలాంటి పని చేసారు అంటే అది వేరే సంగతి, ఇండస్ట్రీ బాగుండాలని అనుకునే దిల్ రాజు లాంటి కీలక పర్సన్ థియేటర్లలో కూడా అలా చేస్తే ఎలా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. 

ఈ విషయం బన్నీ వాస్ దగ్గర ప్రస్తావించగా 128 రూపాయలకే అమ్మాల్సి వుందని, ఏం జరుగుతోందో కనుక్కుంటామని అన్నారు.