మొన్నటివరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ మాత్రమే చేసిన కాజల్, ఈమధ్య కాస్త తన పంథా మార్చినట్టు కనిపిస్తోంది. ఆల్రెడీ ఓటీటీలో హారర్ సిరీస్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఈసారి మరింత థ్రిల్ అందిస్తానంటోంది. అది కూడా ఓటీటీలో కాదు.. ఏకంగా సిల్వర్ స్క్రీన్ పై.
రీసెంట్ గా ఓ ఫిమేల్ ఓరియంటెడ్ కథకు ఓకే చెప్పింది కాజల్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో కథతో పాటు కాజల్ లుక్ కూడా కొత్తగా ఉండబోతోంది. గతంలో పేపర్ బాయ్ అనే సినిమా తీసిన జయశంకర్, ఈ కొత్త కథ రాసుకున్నాడు. ఈమధ్య ఓటీటీలో విటమిన్-షీ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తీసింది కూడా ఇతడే.
నిజానికి ఈ ప్రాజెక్టు ఇప్పటిది కాదు. సెకెండ్ వేవ్ స్టార్ట్ అవ్వకముందే లాక్ అయింది. ఇంకా చెప్పాలంటే కాజల్, తన పెళ్లికి ముందే ఈ స్టోరీకి ఓకే చెప్పింది. ఆ తర్వాత కాజల్ పెళ్లి, ఆ వెంటనే కరోనా సెకెండ్ వేవ్ ప్రభావంతో ఈ సినిమాను ప్రకటించకుండా ఆపేశారు.
ఓ సీనియర్ ప్రొడ్యూసర్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. మరికొన్ని రోజుల్లో రాబోతున్న కాజల్ పుట్టినరోజు నాడు, ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారు. అన్నీ సజావుగా సాగితే, జులై నుంచి సినిమా సెట్స్ పైకి వస్తుంది. కాజల్ కెరీర్ లోనే ఇదొక డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుందని చెబుతున్నారు.