ఔరా..ఆర్ఆర్ఆర్…వాట్ ఏ పాయింట్

ఏ సినిమాలోనూ ఇన్ని ట్విస్ట్ లు వుండవు కదా..ఆర్ఆర్ఆర్ అలియాస్ రఘురామరాజు కేసులో అన్ని మలుపులు. లేటెస్ట్ గా సిఐడీ స్టేట్ మెంట్ భలేగా వుంది.  Advertisement రఘురామ రాజు పాదాల గాయాలు అంటూ,…

ఏ సినిమాలోనూ ఇన్ని ట్విస్ట్ లు వుండవు కదా..ఆర్ఆర్ఆర్ అలియాస్ రఘురామరాజు కేసులో అన్ని మలుపులు. లేటెస్ట్ గా సిఐడీ స్టేట్ మెంట్ భలేగా వుంది. 

రఘురామ రాజు పాదాల గాయాలు అంటూ, వాటి మీద బోలెడు కథనాలు, అనుమానాలు రెకెత్తించే విధంగా రకరకాల వార్తలు. కానీ ఇప్పుడు సిఐడీ స్టేట్ మెంట్ అవన్నీ దూరంగా నెట్టేసింది. 

'రఘురామరాజు కాళ్లపై ఎడీమా వుంది తప్ప, గాయాలు వున్నాయి అని కానీ, అవి పోలీస్ కస్టడీలో అయ్యాయని కానీ ఆర్మీ ఆసుపత్రి తన నివేదికలో పేర్కొన లేదని' సిఐడీ ఈ రోజు ప్రకటించేసింది. 

అంతకు ముందు కూడా రఘరామరాజు కాళ్ల సమస్యపై చాలా నివేదికలు వచ్చాయి. వాటిల్లో కూడా ఎక్కడా గాయాల ప్రస్తావన లేదు. 

అలాగే ఆర్మీ ఆసుపత్రి నివేదికలోనూ గాయాలు అనే మాట లేదు అని సిఐడీ క్లారిటీ ఇచ్చేసింది.

మరి ఇకనైనా బాబుగారి అను'కుల' మీడియా రఘురామరాజు కాళ్లను పట్టుకుని వేలాడుతూ వార్తలు వండి వార్చడం ఆపుతుందా? లేదా 'నీ కాళ్లను పట్టుకువదలమన్నవి చూడే నా కళ్లు' అంటూ పాడుకుంటూ వుంటుందా?