వ్యాక్సీన్ వేసుకుంటే మెలమెల్లగా మాస్క్ లకు గుడ్ బై చెప్పొచ్చు అన్నది విదేశాల్లో కనిపిస్తున్న వ్యవహారం కానీ మన దేశంలో మాత్రం వేరుగా వుంది.
వ్యాక్సీన్ వేసుకున్నంత మాత్రాన ధీమా వద్దు అని, మాస్క్ మస్ట్ అని, సోషల్ డిస్టెన్స్ షరా మామూలే అని అంటున్నారు నీతి అయోగ్ సభ్యుడు వికె పాల్.
వ్యాక్సీన్ నూటికి నూరు శాతం రక్షణ కవచం కాదు అని కూడా ఆయన చెప్పేసారు. మరి విదేశాల్లో ఇలాంటి ఆంక్షలకు గుడ్ బై చెబుతుంటే వ్యాక్సీన్ వేసుకున్నా, ఎప్పటికీ మూతులకు మాస్క్ లు వేసుకునే వుండాలంటున్నారు మన వాళ్లు.
అంటే వాళ్ల వ్యాక్సీన్ లకు మన వ్యాక్సీన్ లకు తేడా వుందా? ఆది నుంచి మన వ్యాక్సీన్ ల విషయంలో అనేకానేక సందేహాలు. ఇప్పుడు ఇలాంటి స్టేట్ మెంట్ లు ఇస్తే ఇంకా..ఇంకా..పుట్టుకువస్తాయి.