ఒక్క లుక్ తో ఎన్ని ముచ్చట్లు తీరాయో?

మాంచి బలమైన కవచం గుండెలకు ధరించి, కత్తి చేతపట్టిన వేషధారణలో రామ్ చరణ్ ను మగధీరలో చూసేసారు. ప్రభాస్ ను బాహుబలిలో చూసారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా ఆ ముచ్చట తీర్చేసుకున్నట్లు…

మాంచి బలమైన కవచం గుండెలకు ధరించి, కత్తి చేతపట్టిన వేషధారణలో రామ్ చరణ్ ను మగధీరలో చూసేసారు. ప్రభాస్ ను బాహుబలిలో చూసారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా ఆ ముచ్చట తీర్చేసుకున్నట్లు కనిపిసోంది లేటెస్ట్ గా విడుదలయిన 'బింబిసార' పోస్టర్ చూస్తుంటే. 

బాబాయ్ బాలయ్య ఎప్పడో చేసేసారు టైమ్ ట్రావెల్ సినిమా ఆదిత్య  369. ఇప్పుడు కళ్యాణ్ రామ్ వంతు వచ్చింది. బింబిసారుడు ఫస్ట్ లుక్ ట్యాగ్ లైన్ అదేగా..

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ150 సినిమాకు మాంచి బలమైన సుత్తి పట్టుకుని రౌడీ మూకల శరీరాలనే సింహాసనం చేసుకుని కూర్చున్నారు. భలేగా వుందిగా పోస్టర్ అనుకున్నారంతా, ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా అచ్చంగా అలాగే కూర్చుని, ఆ ముచ్చట కూడా తీర్చేసుకున్నారు.

ఇంతకీ బింబిసారుడు అంటే అయిదో శతాబ్దంలో మగథ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాజు. ఆయన గురించి చాలా చరిత్ర వుంది. వాటిల్లో మాంచి పాయింట్ ఏమిటంటే ఆయన తన పెళ్లిళ్ల ద్వారా సామ్రాజ్యాన్ని పటిష్టం చేసకునే వ్యూహాలు పన్నారన్నది ఓ పాయింట్.

బాలయ్య బాబాయ్ కృష్ణ దేవరాయల కాలానికి టైమ్ ట్రావెల్ చేసినట్లు కళ్యాణ్ రామ్ ఈ బింబిసారుడి కాలానికి వెళ్తారా? ఆ కాలాన్ని, ఆ చరిత్రను మనకు చూపించబోతున్నారా? ఏమో? కొత్త దర్శకుడు వశిష్ట్ అందిస్తున్న సినిమా విడుదలైతే తప్ప అసలు కథ తెలియదు.