షాకిస్తున్న బ్లాక్ సెంచరీ

బ్లాక్ అంటేనే బ్యాడ్ అన్న సెంటిమెంట్ తో ఉంటారు జనం. అదే బ్లాక్ తో ఫంగస్ అంటే గుండె దడతో వణుకుతున్నారు. హమ్మయ్య కరోనాతో బయటపడ్డామని అనుకున్నంత సేపు లేదు. ఆ వెంటనే బ్లాక్…

బ్లాక్ అంటేనే బ్యాడ్ అన్న సెంటిమెంట్ తో ఉంటారు జనం. అదే బ్లాక్ తో ఫంగస్ అంటే గుండె దడతో వణుకుతున్నారు. హమ్మయ్య కరోనాతో బయటపడ్డామని అనుకున్నంత సేపు లేదు. ఆ వెంటనే బ్లాక్ ఫంగస్ తగులుకుంటోంది. 

అసలు వ్యాధి కంటే కొసరుగా వచ్చిన బ్లాక్ మహమ్మారి ఇంతింతై ఏకంగా ప్రాణాంతకమైపోతోంది. తగిన మందులు అందుబాటులో లేకపోవడంతో పాటు ఇతరత్రా ఇబ్బందులతో బ్లాక్ ఫంగస్ కేసులు ఇపుడు మరణశాసనమే రాస్తున్నాయి.

వారం క్రితం విశాఖలో బ్లాక్ ఫంగస్ తో తొలి మరణం నమోదు అయింది. నాడు ఒక్కటిగా మొదలైన బ్లాక్ ఫంగస్ రేటింగ్ ఈ రోజుకు సెంచరీని టచ్ చేస్తోంది. ప్రతీ రోజూ పాతిక ముప్పయికి తక్కువ కాకుండా కేసులు నమోదు అవుతున్నాయి. 

ఒక వైపు కరోనా రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులలో ఈ రోగులకు ప్రత్యేక పడకలను ఏర్పాటు చేయాల్సివస్తోంది. ఇదిలా ఉంటే రోజులు రెండు వేల దాకా కరోనా కేసులు విశాఖలో నమోదు అవుతున్నాయి.

అదే సమయంలో డిశ్చార్జీలు కూడా మంచి నంబర్ తోనే ఉన్నాయి. అయితే ఇందులో ఒకటి నుంచి రెండు శాతం కేసులు బ్లాక్ ఫంగస్ వైపు టర్న్ తీసుకుంటున్నాయి. ఈ పరిణామాలు జిల్లా వైద్య యంత్రాంగానికే సవాల్ గా మారాయి అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే కరోనా విషయంలో మరో నెల రోజుల పాటు అయినా విశాఖ వాసులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారులు కోరుతున్నారు. బ్లాక్ ఫంగస్ కేసుల పైన కూడా అవగాహన పెంచుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది అని సూచిస్తున్నారు. మొత్తానికి బ్లాక్ షాక్ తో విశాఖ పరేషన్ అవుతోంది.