ఒకనాడు దాని పేరు విద్యల నగరం. అక్కడ లేని విద్య లేదు. సాధించలేని ప్రావీణ్యమూ లేదు. అది సంగీత సరస్వతికి నిలయం. మహా కవులకు ఆటపట్టు. మేటి కళలలు నిలయం. దాని పేరే విజయనగరం జిల్లా.
అక్కడ నుంచి ఒక గురజాడ అప్పారావు పుట్టారు, అక్కడ నుంచి గాన గాంధర్వుడు ఘంటసాల తన గానాన్ని సమస్త జగత్తుకు వినిపించాడు. హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ వంటి వారు ఆ జిల్లా వారే. ఇక చదువులు కోసం ఎందరో విజయనగరం జిల్లాకు వచ్చి నిష్ణాతులుగా మారారు. అటువంటి విద్యల నగరం ఇపుడు వైద్యుల జిల్లాగా మారబోతోంది.
ముఖ్యమంత్రి జగన్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి అత్యంత వెనకబడిన విజయనగరం జిల్లాకు బోధనాసుపత్రితో కూడిన వైద్య కళాశాలను మంజూరు చేశారు. ఈ నెల 30న ఆ కళాశాలకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దాంతో ఇక్కడ నుండి ఎందరో ఉత్తమోత్తమైన డాక్టర్లు లోకానికి పరిచయం కానున్నారు.
ఇన్నాళ్ళూ మాటలు చెప్పిన ఏలికలనే జనాలు చూశారు. ఇపుడు చేతల ముఖ్యమంత్రిగా జగన్ వారి చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తున్నారు. విజయనగర వాసుల కల ఆ విధంగా తీర్చిన ముఖ్యమంత్రి జగన్ కి యావత్తు జిల్లా ఇపుడు ధన్యవాదాలు తెలియచేస్తోంది.