ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ రౌండ్ డిస్కషన్లలో ఎన్టీఆర్ ప్రాధమికంగా ఓకే అన్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్ డెవలప్ మెంట్ ప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమా బిగ్ బాస్ కు అడ్డంపడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దాదాపు 200 వర్కింగ్ డేస్ కాల్ షీట్లు ఇచ్చాడట.
ఇప్పటికి గట్టిగా పాతిక కూడా కాలేదు. ఇంకా 175 కాల్ షీట్లు కావాలి. ప్రస్తుతం షూటింగ్ గ్యాప్ ఇచ్చారు. ఇండియా వైజ్ గా ఎంపిక చేసి, స్టార్ కాస్ట్ ను సెట్ చేసేపనిలో రాజమౌళి బిజీగా వున్నారు. ఈ వర్క్ పూర్తయితే వెంటనే షూట్ కు వెళ్లిపోవాల్సి వుంటుంది. అక్కడ నుంచి డేట్ లు అన్నవి, ఎన్టీఆర్ చేతిలో వుండవు. కాంబినేషన్ల మీద ఆధారపడి వుంటుంది.
అందుకే బిగ్ బాస్ షో చేయడం కన్నా, వదిలేయడానికే ఎన్టీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ మాటీవీ జనాలు మాత్రం ఎలాగైతే అలాగే చేద్దాం, ఎలాగైనా అడ్జస్ట్ చేయమని డిస్కషన్లు సాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇవి ఫలిస్తాయా అన్నది అనుమానమే అని వినిపిస్తోంది.