టైగర్ నాగేశ్వరరావుగా బెల్లంకొండ

హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల బయోపిక్ లు అయిపోయాయి. ఇప్పుడు రాబిన్ హుడ్ టైప్ జనాల కథలు బయోపిక్ లా మలిచే ప్రయత్నాలు షురూ అయ్యాయి. స్టూవర్ట్ పురం రాబిన్ హుడ్ అని పేరు…

హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల బయోపిక్ లు అయిపోయాయి. ఇప్పుడు రాబిన్ హుడ్ టైప్ జనాల కథలు బయోపిక్ లా మలిచే ప్రయత్నాలు షురూ అయ్యాయి. స్టూవర్ట్ పురం రాబిన్ హుడ్ అని పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విషయం గతంలో కూడా వినిపించింది.

వంశీకృష్ణ (కిట్టూ వున్నాడు జాగ్రత్త) తయారుచేసిన కథను, నిర్మాత అనిల్ సుంకర ఓకె చేసారని వార్తలు గతంలో వచ్చాయి. కానీ ఆ తరువాత అప్ డేట్ లేదు. అయితే లేటెస్ట్ గా ఫ్రాజెక్టు వేరే వాళ్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అనే కొత్త బ్యానర్ మీద, అభిషేక్ అగర్వాల్ (అభిషేక్ నామా కాదు) ఈ సినిమాను నిర్మిస్తారు.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ టైగర్ నాగేశ్వరరావు పాత్ర పోషిస్తారు. ప్రస్తుతం చేస్తున్న సినిమా తరువాత బెల్లంకొండ తమిళ సినిమా రాక్షసన్ రీమేక్ చేయాల్సి వుంది. దాని తరువాత ఈ టైగర్ నాగేశ్వరరావు వుండొచ్చు. మధ్యలో రమేష్ వర్మ స్వంత కథతో సినిమా అనుకున్నారు. కానీ అది క్యాన్సిల్ అయి, దాని ప్లేస్ లో రాక్షసన్ రీమేక్ వచ్చి చేరింది.

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?